ప్రజావాణికి 52 వినతులు

ABN , First Publish Date - 2021-10-26T05:39:17+05:30 IST

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 52 వినతులు వచ్చాయి. ప్రగతిభవన్‌ సమావేశ మం దిరంలో కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌లు చి త్రమిశ్రా, చంద్రశేఖర్‌, ఇతర అధికారులు ప్రజల నుం చి వినతులు స్వీకరించారు.

ప్రజావాణికి 52 వినతులు

స్వీకరించిన కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 25: కలెక్టరేట్‌లో  సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 52 వినతులు వచ్చాయి. ప్రగతిభవన్‌ సమావేశ మం దిరంలో కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌లు చి త్రమిశ్రా, చంద్రశేఖర్‌, ఇతర అధికారులు ప్రజల నుం చి వినతులు స్వీకరించారు.

వెంచర్‌ నిర్వాహకులపై చర్యలకు వినతి..

హైదరాబాద్‌ రోడ్డులోని ధర్మారం వద్ద వెంచర్‌ ని ర్వాహకులు అగ్రిమెంట్‌ ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని, వెంచర్‌ నిర్వాహకులపై చర్య లు తీసుకోవాలని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు సో మవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. 

మెప్మా రిసోర్స్‌ పర్సన్‌ల ధర్నా..

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మె ప్మా రిసోర్స్‌ పర్సన్‌లు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలను కలెక్టర్‌ నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

 కలెక్టరేట్‌లో సోమవారం ఓ వ్యక్తి ఒం టిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే పోలీసులు అడ్డుకొని అత న్ని కలెక్టర్‌ నారాయణరెడ్డి వద్దకు తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. జక్రాన్‌పల్లి మండలం అర్గు ల్‌ గ్రామానికి చెందిన సాంబోజి యాదగిరి తమ ఇంటిని అదే గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి  రెండేళ్ల క్రితం రూ.41లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకొని అడ్వాన్స్‌ కింద రూ.12లక్షలు తీసుకున్నాడు. మిగిలిన డబ్బులు రిజిస్ర్టేషన్‌ సమయ ంలో ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, రెండేళ్లు గడిచినా రాజేందర్‌ రిజిస్ర్టేషన్‌ చేయించుకోవడం లేదని, అడ్వాన్స్‌ పోను మిగిలిన సొమ్ము ఇవ్వ కుండా వేధిస్తున్నారని యాదగిరి ఆవేదన వ్యక్తం చే శాడు. అంతేకాకుండా అడ్వాన్స్‌ ఇచ్చిన రూ.12లక్షలతో పాటు మిగిలిన డబ్బులు కూడా ఇచ్చినట్టు ముందే సంతకాలు చేయించుకున్నారని ఆయన పేర్కొన్నాడు. ఈ విషయంలో ప్రజాప్రతినిధి తో పాటు మరో వ్యక్తి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తనకు న్యా యం చేయాలని బాధితుడు కలెక్టర్‌ ముందు తన గో డును వెళ్లబోసుకున్నాడు. కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహ త్యాయత్నంతో ఒక్కసారిగా కలకలం రేగింది. జరిగిన ఘటనతో ప్రజావాణికి వచ్చివారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ప్రభుత్వ భూముల వివరాలు పంపాలి

జిల్లాలోని మున్సిపాలిటీలలో గల ప్రభుత్వ భూ ముల వివరాలు పంపాలని సంబంధిత అదికారుల ను కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవా రం ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో జిల్లా అధి కారుల కో ఆర్డినేషన్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ ప్రభుత్వ భూములు, హ రితహారం, పోడు భూములు, నర్సరీలు, వ్యాక్సినేష న్‌, వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. హరితహారంలో మల్టీలేయర్‌, అవెన్యూ ప్లాం టేషన్‌లో ఒక్క మొక్క కూడా ఎండిపోయి ఉండకూడదన్నారు. ముఖ్యంగా ఎక్కడచూసినా వందశాతం సరిగ్గా ఉండాలన్నారు. అవసరమైతే వారం రోజులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి అయినా ఒక్కట్రీగార్డు ప డిపోయి ఉండకుండా చూడాలన్నారు. ఎండిపోయి న మొక్కల ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్‌ చేయాలన్నారు. జిల్లాలో పలు రహదారుల్లో మొక్కలు బాగున్నాయన్నారు. ధాన్యం సేకరణ 12గంటల్లో అన్‌లోడింగ్‌, మిల్‌ ట్యాపింగ్‌, గన్నీ బ్యాగ్స్‌ చూసుకోవాలన్నారు. ఎఫ్‌ఏ2 ధాన్యాన్ని కొనరాదన్నారు. 18 సంవత్సరాలు నిండినవారు తప్పకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు చిత్రమి శ్రా, చంద్రశేఖర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

యాసంగిలో వరి సాగు వద్దు

ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల ప్రకా రం వచ్చే యాసంగిలో వరి ధాన్యం కొనే అవకాశం లేనందున అధికారులు రైతులను వరిసాగుకు బ దులుగా ప్రత్యామ్నయ పంటలు వేసే విధంగా అవ గాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్ట ర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం సంబ ంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహి ంచి వివరాలు వెల్లడించారు. విత్తన డీలర్లు ఈ వి షయాలను దృష్టిలో పెట్టుకుని వరి విత్తనాలకు బ దులు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సమావేశంలో జేడీఏ గోవింద్‌, శాస్త్రవేత్తలు నవిన్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2021-10-26T05:39:17+05:30 IST