కుమార్తెతో అసభ్య ప్రవర్తన.. తండ్రి అరెస్టు
ABN , First Publish Date - 2021-07-20T22:06:53+05:30 IST
కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ తండ్రిని పింప్రి చించ్వాడ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పూణె: కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ తండ్రిని పింప్రి చించ్వాడ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 51 ఏళ్లున్న తండ్రి సవతి కుమార్తెతో అసభ్యంగా వ్యవహరించాడు. పదో తరగతి చదువుతున్న ఆ బాలికను 2016 నుంచి అతడు శారీరకంగా వేధిస్తున్నాడు. ఆమెను అనుచితంగా తాకుతూ అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
బాలిక తల్లి అనారోగ్యంతో 2016లో చనిపోయింది. అప్పటి నుంచి ఆమె తండ్రితో కలిసి ఉంటుంది. అయితే ఆదివారం బాలికపై తండ్రి లైంగిక దాడికి యత్నించగా ఆమె ఇంట్లోంచి పారిపోయింది. తనకు తెలిసిన వ్యక్తితో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి సామాజిక కార్యకర్తలకు, పోలీసులకు సమాచారం అందించాడు. కుమార్తెపై లైంగిక దాడికి యత్నించగా ఆమె ప్రతిఘటించింది. దీంతో అతడు తలపై కొట్టడంతో బాలికకు గాయాలయ్యాయి. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు.