భూములిస్తే రోడ్డున పడేశారు

ABN , First Publish Date - 2021-05-09T09:04:20+05:30 IST

అమరావతి రాజధాని కోసం 33 వేల ఎకరాలు భూములిచ్చిన వారిని నడిరోడ్డు మీద నిలబెట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు

భూములిస్తే రోడ్డున పడేశారు

508వ రోజు అమరావతి రైతుల ఆందోళనలు


తుళ్ళూరు, మే 8: అమరావతి రాజధాని కోసం 33 వేల ఎకరాలు భూములిచ్చిన వారిని నడిరోడ్డు మీద నిలబెట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని మహిళలు, రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం శనివారంతో 508వ రోజుకు చేరకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాట్లాడారు. అమరావ తి అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిసి కూడా స్వార్థ ప్రయోజనాల కోసం మూడు ముక్కల ఆట ఆడుతున్నారని విమర్శించారు. రైతు కూలీలకు రూ.5,000 పింఛన్‌ అమలు చేయాలన్నారు.  కరోనా సమయంలో కూడా పింఛన్‌ పెండింగ్‌లో ఉంచారన్నారు.

Updated Date - 2021-05-09T09:04:20+05:30 IST