ఈ ఏడాది 5,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు

ABN , First Publish Date - 2020-10-21T09:13:11+05:30 IST

ఊహించిన దాని కంటే సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ వేగంగా కోలుకుంటోంది. విద్యా, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో ఆకర్షణీయమైన..

ఈ ఏడాది 5,000 మంది  ఫ్రెషర్లకు ఉద్యోగాలు

హైసియా అంచనా..

వచ్చే నెల 5న ఇన్నోవేషన్‌ సదస్సు 


 హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఊహించిన దాని కంటే సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ వేగంగా కోలుకుంటోంది. విద్యా, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో ఆకర్షణీయమైన వృద్ధి నమోదవుతోందని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ప్రెసిడెంట్‌ భరణి కే అరోల్‌ అన్నారు. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి ప్రధాన కంపెనీల పనితీరు ఆశాజనకంగా ఉంది. నియామకాలు ఊపందుకుంటున్నా యి. గత ఏడాది ఫ్రెషర్లకు ఇచ్చిన లెటర్లను అన్ని కంపెనీలు హానర్‌ చేసి నియమించుకుంటున్నాయని అన్నారు.


వచ్చే నెల 5న నిర్వహించనున్న హైసి యా ఇన్నోవేషన్‌ సమ్మిట్‌ 2020 వివరాలను వెల్లడించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌కు ముందు పరిస్థితులతో పోలిస్తే నియామకాలు 90 శాతం స్థాయికి చేరుకున్నాయి. పరిశ్రమ వృద్ధి రేటు నమోదు చేయగలదని అయితే.. గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లోని కంపెనీలు కనీసం 5,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉందని చెప్పా రు. ప్రస్తుతానికి కంపెనీలు ఉద్యోగులు ఇంటి వద్దే ఉండి పని చేయడానికి ఇష్టపడుతున్నాయని.. కొవిడ్‌ అనంతరం కంపెనీలు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నాయన్నారు.


150 స్టార్ట్‌పలు

హైసియా ఇన్నోవేషన్‌ సదస్సులో భాగంగా సమావేశాలు, ప్రదర్శన, అవార్డుల ప్రదానం జరుగుతుంది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో దీన్ని నిర్వహిస్తున్నారు. సదస్సులో పాలుపంచుకోవడానికి 100 మందిని మాత్రమే అనుమతించినప్పటికీ.. వర్చ్యువల్‌గా 150 స్టార్టప్‌ ప్రతినిధులు, 1000 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. కొవిడ్‌ అనంతరం హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ అనుసరించాల్సిన విధానాలపై ఈ సదస్సులో శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. వివిధ విభాగాల్లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు అవార్డులు ప్రదానం చేస్తారు. సదస్సులో ఇన్ణోసిస్‌ సీఓఓ యూబీ ప్రవీణ్‌ రావు కీలకోపన్యాసం చేస్తారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు పాల్గొంటారు. సదస్సు నిర్వహణను ప్రకటించిన సందర్భంగా ఎస్‌టీపీఐ, హైదరాబాద్‌ డైరెక్టర్‌ రామ్‌ ప్రసాద్‌ మాట్లాడారు. 

Updated Date - 2020-10-21T09:13:11+05:30 IST