మహిళల జన్‌ధన్‌ ఖాతాల్లోకి రూ. 500

ABN , First Publish Date - 2020-06-05T07:55:36+05:30 IST

మహిళల జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాల్లో శుక్రవారం నుంచి రూ.500 వేస్తామని కేంద్రం తెలిపింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌, మే నెలల్లో చెల్లించామని, ఇప్పుడు మూడవ, తుది విడత వేస్తామని పేర్కొ న్నది...

మహిళల జన్‌ధన్‌  ఖాతాల్లోకి రూ. 500

న్యూఢిల్లీ, జూన్‌ 4: మహిళల జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాల్లో శుక్రవారం నుంచి రూ.500 వేస్తామని కేంద్రం తెలిపింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌, మే నెలల్లో చెల్లించామని, ఇప్పుడు మూడవ, తుది విడత వేస్తామని పేర్కొ న్నది. ఖాతా నెంబరులో ఆఖరి సంఖ్య 0 లేదా 1 ఉన్న వారికి శుక్రవారం, 2 లేదా 3 ఉంటే శనివారం, 4 లేదా 5 ఉంటే 8వ తేదీన, 6 లేదా 7 సంఖ్య ఉంటే 9న, 8 లేదా 9 సంఖ్య ఉంటే 10వ తేదీన డబ్బులు జమవుతాయి.


Updated Date - 2020-06-05T07:55:36+05:30 IST