మూడేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2021-01-21T05:58:40+05:30 IST

కార్పొరేట్‌ కంపెనీల కోసం ‘వైజ్‌ లీ’ ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభించినట్టు తన్లా ప్లాట్‌ఫారమ్స్‌ ప్రకటించింది. మైక్రోసా్‌ఫ్టతో కలిసి బ్లాక్‌చెయిన్‌ ఆధారంగా అభివృద్ధి చేసిన

మూడేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కార్పొరేట్‌ కంపెనీల కోసం ‘వైజ్‌ లీ’ ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభించినట్టు తన్లా ప్లాట్‌ఫారమ్స్‌ ప్రకటించింది. మైక్రోసా్‌ఫ్టతో కలిసి బ్లాక్‌చెయిన్‌ ఆధారంగా అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫారమ్‌ కంపెనీలు, కస్టమర్లకు మధ్య భద్రమైన, నమ్మకమైన కమ్యూనికేషన్‌ కోసం దోహదం చేస్తుందని తన్లా చైర్మన్‌, సీఈఓ ఉదయ్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఎంఎ్‌సలు, ఇ-మెయిల్స్‌, వాట్స్‌యాప్‌, పుష్‌ నోటిఫికేషన్లు, ఎఫ్‌బీ మెసెంజర్‌ వంటి వాటిలో డేటా సెక్యూరిటీ, ప్రైవసీ మరింత మెరుగ్గా ఉంటుందన్నారు. కమ్యూనికేషన్స్‌ ప్లాట్‌ఫారమ్‌ను యాజ్‌-ఎ-సర్వీ్‌సగా  (సీపీఏఏఎస్‌) తన్లా అందిస్తోంది. కొత్త ప్లాట్‌ఫారమ్‌ను విడుదల చేసిన సందర్భంగా ఉదయ్‌ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఇంటర్వ్యూ వివరాల్లోకి వెళితే..


వైజ్‌లీ ప్లాట్‌ఫారమ్‌ కంపెనీ ఆదాయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపగలదు?

ప్రపంచ మార్కెట్‌ కోసం వైజ్‌లీ ప్లాట్‌ఫారమ్‌ను మైక్రోసా్‌ఫ్టతో కలిసి అభివృద్ధి చేశాం. మైక్రోసాఫ్ట్‌ అజుర్‌, బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా దీన్ని అభివృద్ధి చేశాం. మొబైల్‌ క్యారియర్‌ కంపెనీలు, ఓటీటీ ప్లేయర్లు, ఈ-కామర్స్‌ కంపెనీలు, ప్రభుత్వాలు భద్రతతో కూడిన సందేశాలను కస్టమర్లకు పంపడానికి దోహదం చేస్తుంది. ఎడ్జ్‌-టు-ఎడ్జ్‌ ఎన్‌స్ర్కిప్షన్‌ వల్ల ఇది సాధ్యం. వైజ్‌లీ మార్కెట్‌ప్లేస్‌ ద్వారా కంపెనీలు ప్రపంచ స్థాయిలో సరఫరాదారులు, సర్వీస్‌ ప్రొవైడర్లను గుర్తించవచ్చు. మైక్రోసా్‌ఫ్టతో కలిసి ఈ ప్లాట్‌ఫారమ్‌ను మార్కెటింగ్‌ చేస్తాం. ఈ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా కమర్షియల్‌ కమ్యూనికేషన్స్‌లో తన్లా తన  స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటుంది. ఆదాయంపై ప్రభావాన్ని ఇప్పుడే చెప్పలేం. 


వచ్చే రెండు, మూడేళ్లలో ఏ మేరకు పెట్టుబడులు పెట్టనున్నారు?

వచ్చే రెండు, మూడేళ్లలో ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధిపై రూ.500 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాం. ఈ నిధులను అంతర్గతంగానే సమకూర్చుకోనున్నాం. కంపెనీ ఖాతాదారుల జాబితాలో దాదాపు 1,500 సంస్థలు ఉన్నాయి. ఖాతాదారుల సంఖ్యను  పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నాం.


 ఇటీవల మార్కెట్‌లో తన్లా షేరు ఆకర్షణీయంగా పెరిగింది. దీనిపై మీ స్పందన?

మార్కెట్‌లో షేరు ధర హెచ్చుతగ్గులపై స్పందించలేం.


భవిష్యత్తులో మరిన్ని ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేస్తారా?

నాలుగు నెలల క్రితం దేశీయ మార్కెట్‌ కోసం ట్రూబ్లాక్‌ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించాం. దేశంలోని ప్రముఖ బ్యాంకులు, బీమా, రిటైల్‌ కంపెనీలు, ఈ-కామర్స్‌ కంపెనీలు ఎస్‌ఎంఎ్‌సలు, ఈ-మెయిల్స్‌ మొదలైన వాటికి దీన్ని వినియోగిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌పై రోజుకు 80 కోట్ల సందేశాలు ప్రాసెస్‌ అవుతున్నాయి. దేశీయ కమర్షియల్‌ కమ్యూనికేషన్స్‌లో 70 శాతం లావాదేవీలు (అప్లికేషన్‌-టు-పర్సన్‌ సందేశాలు) ట్రూబ్లాక్‌ పైనే జరుగుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేస్తాం. వైజ్‌లీ ప్లాట్‌ఫారమ్‌పై ప్రస్తుతం కమ్యూనికేషన్స్‌ ప్రొడక్ట్‌ను విడుదల చేశాం. మరిన్ని ఉత్పత్తులను అభివృద్ధి చేస్తాం.

Updated Date - 2021-01-21T05:58:40+05:30 IST