ఏడాదిలోనే 50 ఏళ్ల వ్యర్థాలు

ABN , First Publish Date - 2021-07-27T08:56:38+05:30 IST

కొవిడ్‌ కారణంగా ఆస్పత్రుల్లో భారీగా బయో మెడికల్‌ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. మహమ్మారి వల్ల తెలంగాణ లో 50 సంవత్సరాల్లో ఉత్పత్తి అయ్యే బయో వ్యర్థాలు.

ఏడాదిలోనే 50 ఏళ్ల వ్యర్థాలు

  • కరోనా నేపథ్యంలో భారీగా బయో మెడికల్‌ వ్యర్థాల ఉత్పత్తి
  • తెలంగాణలో 55 రెట్లు పెరుగుదల
  • దేశవ్యాప్తంగా 87 రెట్లు అధికం
  • వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ


హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కారణంగా ఆస్పత్రుల్లో భారీగా బయో మెడికల్‌ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. మహమ్మారి వల్ల తెలంగాణ లో 50 సంవత్సరాల్లో ఉత్పత్తి అయ్యే బయో వ్యర్థాలు.. కేవలం ఒక్క ఏడాదిలోనే పోగైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించే సమయంలో వచ్చే బయో మెడికల్‌ వ్యర్థాలు, వాటిని శుద్ధి చేసే సామర్థ్యం, తదితర వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ  సోమవారం వెల్లడించింది. వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా బయో మెడికల్‌ వ్యర్థాలు ఈ ఒక్క ఏడాదిలోనే 87 రెట్లు పెరిగినట్లు తెలిపింది. అయితే వాటిని శుద్ధి చేసే సామర్థ్యం కూడా 7.5 రెట్లు ఎక్కువగానే ఉన్నట్లు పేర్కొంది. 


శుద్ధి చేసే సామర్థ్యం ఎక్కువే..

రాష్ట్రంలో కొవిడ్‌ రాకముందు ఆస్పత్రుల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు చాలా తక్కువగా ఉండేవి. 2017-18లో 15.7 టన్నులు ఉత్పత్తి కాగా, 2018-19 నాటికి 16.2 టన్నులకు చేరింది. 2019-20 నాటికి 20.5 టన్నులకు పెరిగింది. ఏటా ఆస్పత్రుల్లో బయో మెడికల్‌ వ్యర్థాలు పెరుగుతూ నే ఉన్నాయి. అయితే కొవిడ్‌ వ్యాప్తి ప్రారంభమయ్యాక అది ఒక్కసారి 55 రెట్లు పెరిగింది. 2020-21 ఏడాదిలో ఏకంగా 1,109.7 టన్నుల వ్య ర్థాలు ఉత్పత్తి అయ్యాయి. అంటే రోజుకు సగటున 3 టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి. గత50 ఏళ్లుగా ఉత్పత్తి అయిన వ్యర్థాలన్నీ కొవిడ్‌ వల్ల కే వలం ఒక్క ఏడాదిలోనే జమయ్యా యి. తెలంగాణలో 11కేంద్రాల్లో బయో మెడికల్‌ వ్యర్థాలను శుద్ధి చేస్తున్నారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, యాదాద్రి జిల్లాల్లో ఒ క్కో కేంద్రం, మెదక్‌లో మూడు కేంద్రాలున్నాయి. ఈ ప్లాంట్లలో రోజుకు 90 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. అంటే ఉత్పత్తి అయ్యే దానికంటే 30 రెట్లు ఎక్కువగానే శుద్ధి చేసే సామర్థ్యం మన దగ్గర ఉంది. 


దేశంలో ఇలా..

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నాన్‌ కొవిడ్‌ సమయంలో ఏడాదికి సగటున 500-600 టన్నుల బయో మెడికల్‌ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. సర్కారు గణాంకాల ప్రకారం.. 2019-20లో దేశం లో 615 టన్నుల వ్యర్థాలు జమ అయ్యాయి. అయితే, కొవిడ్‌ ప్రారంభమైన ఏడాదిలోనే ఏకంగా 56,898.4 టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి.  


సామర్థ్యం ఉన్నా.. శుద్ధి చేయడం లేదు..

రాష్ట్రంలో రోజుకు 90 టన్నుల బయో మెడికల్‌ వ్యర్థాలను శుద్ధి చేసే సామర్థ్యం ఉన్నా, సకాలంలో వాటిని శుద్ధి చేయడం లేదు. సమన్వయలో పం, మానవ వనరుల కొరత, రోజూ ఆస్పత్రుల నుంచి వ్యర్థాలను సేకరించకపోవడం కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2021-07-27T08:56:38+05:30 IST