ముంబై: ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియంలోకి ప్రేక్షకుల సంఖ్యను పెంచారు. ఇకనుంచి 50శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తున్నట్టు లీగ్ టికెటింగ్ భాగస్వామి బుక్‌మైషో శుక్రవారం ప్రకటించింది. మొదట్లో స్టేడియంలోకి 25 శాతం మంది ప్రేక్షకులకు మాత్రమే మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే శనివారం నుంచి రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలను ఎత్తివేయడంతో స్టేడియంలోకి ప్రేక్షకుల సంఖ్యను పెంచాలని బీసీసీఐ నిర్ణయించిందని బుక్‌మైషో తెలిపింది.