ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు 50శాతం దాటొద్దు: కేంద్రం

ABN , First Publish Date - 2020-09-25T09:32:22+05:30 IST

రాష్ట్ర విపత్తు స్పందన నిధుల (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కింద విడుదల చేసే నిధుల్లో 50 శాతానికి మించకుండా కొవిడ్‌ నియంత్రణకు వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది...

ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు 50శాతం దాటొద్దు: కేంద్రం

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విపత్తు స్పందన నిధుల (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కింద విడుదల చేసే నిధుల్లో 50 శాతానికి మించకుండా కొవిడ్‌ నియంత్రణకు వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏయే వాటికి నిధులను ఖర్చు చేయాలనే అంశంపై స్పష్టత ఇస్తూ కేంద్రం గురువారం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. కట్టడి ప్రాంతాల్లో కొవిడ్‌ రోగులకు తాత్కాలిక వసతి, ఆహారం, దుస్తులు, మెడికల్‌ కేర్‌, శాంపిళ్ల సేకరణ కోసం పరికరాల కొనుగోలు, పరీక్షలు, కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ , పీపీఈ కిట్ల కొనుగోలు, థర్మల్‌ స్కానర్లు, వెంటిలేటర్లు, ఎయిర్‌ ప్యూరిఫైయర్లు వంటి వాటికి 50 శాతం నిధులను వినియోగించుకోవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది. 


Updated Date - 2020-09-25T09:32:22+05:30 IST