Shocking News: 5ఏళ్లకే తల్లైన చిన్నారి.. తలలు పట్టుకున్న వైద్యులు.. చివరికి అసలు విషయం వెలుగులోకి!

ABN , First Publish Date - 2022-05-10T00:40:50+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో బిడ్డకు జన్మనిచ్చింది ఓ చిన్నారి.. వినడానికి ఆశ్చర్యంగా

Shocking News: 5ఏళ్లకే తల్లైన చిన్నారి.. తలలు పట్టుకున్న వైద్యులు.. చివరికి అసలు విషయం వెలుగులోకి!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో బిడ్డకు జన్మనిచ్చింది ఓ చిన్నారి.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంటర్నెట్, సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఈ వార్త సంచలనం సృష్టించింది. 


పెరు దేశంలోని టిక్రాపోకు చెందిన లీనా మదీనా.. 1933 సెప్టెంబర్‌ సెప్టెంబర్‌ 27న జన్మించింది. అందరితోపాటు ఆడుతూ పాడుతూ సంతోషంగా తన బాల్యాన్ని గడుపుతూ వచ్చింది. అయితే 1938వ సంవత్సరంలో లీనాకు ఐదేళ్ల వయసు వచ్చేసరికి.. చిన్నారి పొట్ట కాస్త పెరగడాన్ని కుటుంబసభ్యులు గమనించారు. క్రమంగా పొట్ట కాస్త పెద్దదవుతుండడంతో వైద్యున్ని ఆశ్రయించారు. ముందుగా లీనా కడుపులో ఏదో కణతి లాంటిది ఉండొచ్చని డాక్టర్లు భావించారు. పాపకు టెస్టులు చేశాకే.. లీనా కడుపులో ఉన్నది కణతి కాదు.. బిడ్డ అని తెలిసింది.



దీంతో వైద్యులంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. తరువాత ఈ విషయాన్ని పాపతో పాటు వారి తల్లిదండ్రులకు చెప్పారు. అప్పటి నుంచి లీనాను, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నారు. తరువాత 1939 మే 14న సిజేరియన్ ద్వారా చిన్నారి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది లీనా. పుట్టినప్పుడు ఆ బిడ్డ బరువు 2.7 కిలోలు ఉంది. శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కొన్ని రోజుల తర్వాత ఐదేళ్ల చిన్నారికి బిడ్డ పుట్టడం ఎలా సాధ్యమని పెరూ వైద్యులు రీసెర్చ్‌ చేశారు. తమకు తెలిసిన వైద్య నిపుణులను సంప్రదించారు. కానీ ఎక్కడా వారికి సమాధానం దొరకలేదు. 


ఆ తర్వాతే వైద్యులకు సమాధానం దొరికింది. లీనా మదీనాకు ప్రికోషియస్ ప్యుబర్టీ అనే సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇందువల్లే చిన్న వయసులోనే లైంగిక అవయవాలు అభివృద్ధి చెందినట్లు కనుగొన్నారు. దీనివల్ల లీనాకు మూడేళ్లకే పీరియడ్స్‌ రావడం ప్రారంభమైందని తెలుసుకున్నారు. కానీ గర్భవతి ఎలా అయిందన్న విషయం మాత్రం వారికీ తెలీలేదు. వైద్యుల పరిశోధిస్తున్న సమయంలోనే టిక్రాపోలో ఓ సాంప్రదాయ పండగ వచ్చింది. లీనా తెగవారి సాంప్రదాయం ప్రకారం.. ఈ పండగ సందర్భంగా ఇష్టమైన యువతీ, యువకులు శృంగారంలో పాల్గొంటారు. ఆ సమయంలోనే లీనా ఎవరితోనో శృంగారంలో పాల్గొన్నట్లు తెలిసింది. ఫలితంగా చిన్న వయసులోనే అమ్మ అయింది. ఇది జరిగి 90 ఏళ్లు అవుతోంది. అయినా కూడా ఐదేళ్లకే అమ్మవడం వైద్య శాస్త్రంలో సంచలనమే కదా.


Read more