45రోజుల్లో 5వేల పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2021-04-17T06:30:43+05:30 IST

కరోనా సె కండ్‌ వేవ్‌ విజృంభిస్తున్నా మిర్యాలగూడ డివిజన్‌లో రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోం ది. ముఖ్యంగా సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో అధికార, ప్ర తిపక్ష పార్టీలు కొవిడ్‌ నిబంధనలు మ రిచాయి.

45రోజుల్లో 5వేల పాజిటివ్‌లు
టెస్టుల కోసం ఏరియాఆసుపత్రిలో క్యూకట్టిన జనం (ఫైల్‌)

మిర్యాలగూడ డివిజన్‌లో కరోనా ఉధృతి

రోజుకు సుమారు 100మందికి నమోదు


త్రిపురారం మండల పరిధిలోని ఓ గ్రామంలో 45ఏళ్ల వ్యక్తికి అన్నం సహించక రెండు రోజుల పాటు కొద్ది పరిమాణంలో  పండ్లు, పాలు మా త్రమే తీసుకున్నాడు. మూడోరోజు నుంచి నీరసించి శక్తి కోల్పోయాడు. తనకు తెలిసిన ప్రభుత్వ వైద్యుడికి ఫోన్‌ చేస్తే బైక్‌పై ఆస్పత్రికి రమ్మని పిలిచాడు. బైక్‌ను నడపలేనని చెప్పడంతో 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించి పరీక్షించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీనికి తోడు రక్తకణాలు తగ్గి అత్యవసర చికిత్స అందించాల్సి వచ్చింది. అతడితో పా టు భార్య, కూతురు సైతం కరోనా బారిన పడ్డారు. అప్పటికే ఆ ఊరిలో ఐదు పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఎన్నిక ప్రచార నేపథ్యంలోనే పాజిటివ్‌ కేసులు నమోదైందన్న అనుమానాలు ఉన్నాయి.


 మిర్యాలగూడ, ఏప్రిల్‌ 16 : కరోనా సె కండ్‌ వేవ్‌ విజృంభిస్తున్నా మిర్యాలగూడ డివిజన్‌లో రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోం ది. ముఖ్యంగా సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో అధికార, ప్ర తిపక్ష పార్టీలు కొవిడ్‌ నిబంధనలు మ రిచాయి. ప్రచారానికి రాష్ట్ర నలుమూలల నుంచి నేతలు రావడం, ఎక్కుమంది ప్రజలను సమీకరించి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించే సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడంతో  నియోజకవర్గంలో వంద ల సంఖ్యలో ప్రజలు కొవిడ్‌ బారిన పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. మిర్యాలగూడ డివిజన్‌లో సెకండ్‌ వేవ్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి నుంచి ఏప్రిల్‌ 15నాటికి 5,210 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  తొలుత డివిజన్‌లో రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవగా ఏప్రిల్‌ మొదటి వారం నుంచి వం దల్లోకి చేరింది. 14వ తేదీన 142, 15న 139, 16న 150 కేసులు నమోదయ్యాయి. సాగర్‌ నియోజకవర్గంలో ఏప్రిల్‌15 నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిపిన పరీక్షల్లో సాగర్‌లో 217, మాడ్గులపల్లి60, త్రిపురారం43, తిరుమలగిరి(సాగర్‌) 8, నిడమనూరు 18, గుర్రంపోడు 23, హాలియా 153, పెద్దవూర 63 పాజిటివ్‌  కేసులు నమోదవగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నిత్యం వందల కొద్ది  రోగులు  చికిత్స చేయించుకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం 45రోజుల వ్యవధిలోనే సాగర్‌ నియోజకవర్గంలో సు మారు 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉప ఎన్నిక సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడంతో సాగర్‌ నియోజకవర్గంలో కరోనా మరింత వేగంగా విస్తరిస్తోందని అంటున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న నిడమనూరు రెవెన్యూ కార్యాలయ అధికారి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కొవిడ్‌ బారిన పడ్డారు.   హైదరాబా ద్‌ నుంచి సాగర్‌కు ప్రచారానికి వచ్చిన ఇద్దరు కాంగ్రెస్‌ నేతలకు పాజిటి వ్‌ వచ్చింది. మాడ్గులపల్లి మండలంలో ప్రచారం సాగించిన టీఆర్‌ఎస్‌ ఆర్మూర్‌ ఎమ్మెల్యే అనుచరులకు కరోనా ఉన్నా ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలతో గందరగో ళం ఏర్పడింది. ముఖ్య నేతల సభల సమయంలో మారుమూల గ్రామాల నుంచి ట్రాక్టర్ల పై, ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణాలు సాగించారు. రాజకీయ ప్రచారం కోసం అన్ని పార్టీల ముఖ్య నేతలు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి రోజు సాగర్‌ ప్రచారానికి వెళ్లి వచ్చా రు. సాగర్‌ ఎన్నిక ప్రచారం ముగింపుతో ఇతర ప్రాంతాల నేతలు నియోజకవర్గంలో స్టే చేయడానికి వీలులేదని పోలీసుల హెచ్చరికల నేపధ్యంలో బస కోసం అత్యంత సమీపంలోని మిర్యాలగూడ పట్టణంలోని లాడ్జిలను ఆశ్రయించారు. దీంతో రాకపోక లు విస్తృతంగా సాగి పట్టణ ప్రాంతంలోని ప్రజలకు కోవిడ్‌ విస్తరించే అవకాశాలు పెరిగాయి. నాలుగైదు రోజులుగా రోజు30కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఏరియా ఆసుపత్రిలో జరిపిన పరీక్షల్లో  ఈ నెల 14న  36మందికి, 15న 31మందికి, 16న 32 మందికి పాజిటివ్‌ వచ్చంది. 


కచ్చితంగా నిబంధనలు పాటించాలి  : ముశం ప్రభాకర్‌, మండల వైద్య విస్తరణాధికారి

వేగంగా విస్తరిస్తున్న కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ను నిరోధించడానికి నిబంధనలు అత్యంత కఠినంగా పాటించాలి. భౌతిక దూరం పాటించడంతో పాటు, మాస్క్‌ను విధిగా ధరించాలి. తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడంతో పాటు, శాని టైజర్‌ను వినియోగించాలి. విందులు, వినోదాలు, ప్రయాణాలు తగ్గించాలి. సాధ్యమైనంత మేరకు సమూహాలకు దూరంగా ఉండాలి. 45 ఏళ్లు పైబడిన వారు విధిగా టీకా వేయించుకోవాలి.  ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి  ప్రజలందరూ నిబంధనలు పాటించాలి.


Updated Date - 2021-04-17T06:30:43+05:30 IST