అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసుకున్న 5 మొబైల్‌ గేమ్స్‌

ABN , First Publish Date - 2022-07-02T09:01:42+05:30 IST

సెల్‌ చేతిలో ఉంటే, తీరిక కూడా దొరికితే ఆట ఆడాల్సిందే. ఇందులో చిన్న పెద్ద అన్న తారతమ్యం ఏమీ లేదు.

అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసుకున్న 5 మొబైల్‌ గేమ్స్‌

సెల్‌ చేతిలో ఉంటే, తీరిక కూడా దొరికితే ఆట ఆడాల్సిందే. ఇందులో చిన్న పెద్ద అన్న తారతమ్యం ఏమీ లేదు. ఎవరి స్థాయిలో వారు ఆడేస్తున్నారు అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. తొలి మొబైల్‌ గేమ్‌ ‘స్నేక్‌’’ కు ఇప్పటికి ఊహించలేనంత మార్పులు వచ్చాయి. ఈ సందర్భంలో గడచిన మే నెలలో ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేసుకున్న గేమ్స్‌ ఒకసారి చూద్దామా....


ఇప్పటికీ టాప్‌ పొజిషన్‌లో సబ్‌వే సర్ఫర్స్‌ ఉంది. ఈ గేమ్‌ మూడు కోట్ల మేర డౌన్‌లోడ్స్‌తో మొదటి స్థానంలో ఉంది. ఇటీవలే అది పదో వార్షికోత్సవాన్ని కూడా జరుపుకొంది. అదెంత పటిష్టంగా ఉందో చెప్పడానికి డౌన్‌లోడ్‌ లెక్కలు చాలు.

ఘరేనా ఫ్రీ ఫైర్‌ 2.6కోట్ల డౌన్‌లోడ్స్‌తో రెండో స్థానంలోఉంది. ఇండియాలో ఈ గేమ్‌ను నిషేధించారు. అయినప్పటికి ప్రపంచంలో దీనికి ఉన్న ఆదరణ ఫలితంగా రెండో స్థానంలో ఉంది.

టాల్‌ మేన్‌ రన్‌ తదుపరి స్థానంలో ఉంది. సూపర్‌సోనిక్‌ స్టూడియో నుంచి వచ్చిన పాపులర్‌ గేమ్‌ ఇది. ఇదో క్యాజువల్‌ రన్నర్‌ గేమ్‌. బీట్‌ చేసే స్థాయిలో కేర్టెర్‌ ఇక్కడ లక్ష్యంగా ఉంటుంది.

ఎపెక్స్‌ లెజెండ్స్‌ నాలుగో స్థానంలో ఉంది. ఆన్‌లైన్‌ మల్టీప్లేయిర్‌ గేమ్‌ ఇది. ఈఏ మాదిరిగా ఇది ఉంటుంది. 

డెలివర్‌ ఐటి 3డి  అయిదో స్థానంలో ఉంది. కస్టమర్లకు ప్యాకేజీలను పికప్‌ లేదంటే డ్రాప్‌ ద్వారా సొమ్ములు రాబట్టడంలో పోటీ లేదంటే లెవెల్‌ పెరగడం ఉంటుంది. అలాగే ఈ ఆటలో భాగంగా ప్రపంచాన్వేషణకు తోడు సరికొత్త జోన్లను కనుగొనాల్సి ఉంటుంది. 

Updated Date - 2022-07-02T09:01:42+05:30 IST