Advertisement
Advertisement
Abn logo
Advertisement

వామ్మో.. 5 నిమిషాల్లో 30సార్లు ఎత్తి పడేశాడు..!

గుంటూరు జిల్లా/ఫిరంగిపురం : మండలంలోని వేములూరిపాడు లో సంక్రాంతి సంబరాల సందర్భంగా శుక్రవారం రాష్ట్ర స్థాయి గుండురాయి ఎత్తుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. పమిడిపాడుకు చెందిన మద్దాలి వీరాంజనేయులు 102 కేజీల బరువున్న రాయిని ఐదు నిమిషాల్లో 30సార్లు ఎత్తి పడవేసి విజేతగా నిలిచాడు. రూ.5,116 నగదు బహుమతి అందుకున్నా రు. పిల్లి శోభన్‌ 28 సార్లు ఎత్తి పడవేసి ద్వితీయ స్థానంలో నిలిచాడు. పిన్నెల్లికి చెందిన ఎన్‌.రామాంజనేయులు 27 సార్లు ఎత్తి పడవేసి తృతీయ బహుమతి సాధించాడు. షేక్‌ అఫీజ్‌ ప్రత్యేక బహుమతి అందుకున్నాడు. వారికి సర్పంచ్‌ కొరివి చిన్న ఆనంద్‌, జిల్లా ముస్లిం మైనార్టీ సెల్‌ అధ్యక్షులు సయ్యద్‌ హబీబుల్లా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భీమనాథుని చలపతిరావు మాట్లాడుతూ భీమనాథుని అంజమ్మ, వెంకట సుబ్బయ్యల జ్ఞాపకార్థం ఈ పోటీలను వరుసగా 9వ ఏడాది నిర్వహిం చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement