కరోనా పోరుకు 5 లక్షల మంది వాలంటీర్లు!

ABN , First Publish Date - 2020-03-26T23:22:31+05:30 IST

కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నవారికి నిత్యావసరాలు అందించడానికి వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని వెల్లడించారు. ఆరోగ్యవంతులైన యువకులు వాలంటీర్లుగా నమోదుచేసుకోవచ్చని చెప్పారు.

కరోనా పోరుకు 5 లక్షల మంది వాలంటీర్లు!

లండన్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4లక్షలపైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. బ్రిటన్ లో కూడా ఈ మహమ్మారి తన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే ఇక్కడ 465 మంది కరోనాకు బలయ్యారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాడటానికి నేషనల్ హెల్త్ స్కీం ప్రకటించారు. దీనిలో భాగంగా కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నవారికి నిత్యావసరాలు అందించడానికి వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని వెల్లడించారు. ఆరోగ్యవంతులైన యువకులు వాలంటీర్లుగా నమోదుచేసుకోవచ్చని చెప్పారు. మంగళవారం ఈ ప్రకటన వెలువడగా, ఇప్పటివరకు సుమారు 5లక్షలమంది వాలంటీర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలుస్తోంది. ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 15 లక్షలమందికి నిత్యావసరాలు సరఫరా చేస్తారు.

Updated Date - 2020-03-26T23:22:31+05:30 IST