గాంధీనగర్: ఒక ఆటో డ్రైవర్ హత్య కేసులో ఒక మహిళ సహా మొత్తం ఐదుగురికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు గుజరాత్లోని వడోదర కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. 2018లో ఫర్హాన్ షైక్, అతడి బాబాయి మునాఫ్ షైక్లతో ఇయాన్ మీననన్ అనే వ్యక్తికి పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. అనంతరం ఇయాన్తో ఫర్హాన్ తండ్రి ఫారూఖ్ తరుచూ గొడవ పడుతుండే వాడట. ఇది కాస్త ముదిరి ముదిరి ఇయాన్ను ఫారూఖ్ పొడిచాడని కొందరు సాక్ష్యలు చెప్పారు. తీవ్ర గాయాలపాలైన ఇయాన్ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. ఇక దీనిపై అప్పట్లోనే నమోదైన కేసును కోర్టు విచారణకు తీసుకుంది. ఫారూఖ్తో పాటు ఫర్హాన్, మునాఫ్.. మరో ఇద్దరు వ్యక్తులు నిందితులపై వచ్చిన ఆరోపణలు కోర్టు ముందు రుజువు కావడంతో ఐదురుగురి కోర్టు జీవిత ఖైదు విధించింది.
ఇవి కూడా చదవండి