పన్ను ఆదాకు ఈ 5 బెస్ట్‌

ABN , First Publish Date - 2020-10-04T06:20:06+05:30 IST

సమర్థవంతంగా ప్లాన్‌ చేసుకోగలిగితే పన్నుల ద్వారా వెలుపలికి పోయే సొమ్ము ఆదా చేసుకోవడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే. పటిష్ఠమైన ప్రణాళిక ద్వారా పన్నుల రూపంలో మన ఆదాయం నుంచి తరలిపోయే సొమ్మును ఆదా చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చంటున్నారు క్లియర్‌ టాక్స్‌ సీఈఓ అర్చిత్‌ గుప్తా. ఆంధ్రజ్యోతి ‘బిజినెస్‌ ప్లస్‌’ పాఠకుల కోసం ఆ వివరాలు..

పన్ను ఆదాకు ఈ 5 బెస్ట్‌

సమర్థవంతంగా ప్లాన్‌ చేసుకోగలిగితే పన్నుల ద్వారా వెలుపలికి పోయే సొమ్ము ఆదా చేసుకోవడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే. పటిష్ఠమైన ప్రణాళిక ద్వారా పన్నుల రూపంలో మన ఆదాయం నుంచి తరలిపోయే సొమ్మును ఆదా చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చంటున్నారు క్లియర్‌ టాక్స్‌ సీఈఓ అర్చిత్‌ గుప్తా. ఆంధ్రజ్యోతి ‘బిజినెస్‌ ప్లస్‌’ పాఠకుల కోసం ఆ వివరాలు..



మనిషి తప్పించుకోలేని ప్రధానాంశాలు రెం డుంటాయి. అవి మర ణం, పన్నులు. క్రమం తప్పకుండా పన్నులు చెల్లించడం ద్వారా జాతీయాభివృద్ధికి పన్నుల రూపంలో తమ వంతు వాటా అందిస్తున్న ఉన్నత వర్గాల జాబితాలో మనం స్థానం సంపాదించుకుంటాం. అయితే చెమటోడ్చి సంపాదించిన సొమ్ము పన్నుల రూపం లో తరలిపోకుండా కొన్ని షరతులు, నియమ నిబంధనలకు లోబడి పరిరక్షించుకునే అవకాశం ఆదాయ పన్ను చట్టం- 1961 కల్పించింది. అలా అందుబాటులో ఉన్న మినహాయింపులు, రాయితీలు సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవడం తెలివైన పని. మన ఆర్థిక ప్రణాళికలో పన్నుల ప్రణాళిక కూడా అత్యంత కీలకం. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల ఆదాకు పనికి వచ్చే కొన్ని సాధనాలు పరిశీలిద్దాం.


ఈఎల్‌ఎ్‌సఎ్‌సతో పొదుపు

వీటినే ఈక్విటీ అనుసంధానిత పొదుపు పథకాలు లేదా పన్ను ఆదాకు దోహదపడే మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లుగా వ్యవహరిస్తారు. ఆదాయ ప న్ను చట్టం-1961 ఈఎల్‌ఎస్‌ఎ్‌సకు మాత్రమే 80 సి సెక్షన్‌ కింద పూర్తి మినహాయింపు ఇ చ్చింది. ఈఎల్‌ఎ్‌సఎస్‌లు దీర్ఘకాలంలో పన్ను ఆదాతో పాటు సంపద కూడగట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. వీటికి మూడేళ్ల లాకిన్‌ కాలపరిమితి ఉంటుంది. 80సీ సెక్షన్‌ కింద అందుబాటులో ఉన్న పన్ను పొదుపు సాధనాల్లో అతి తక్కువ కాలపరిమితి ఉన్నవివే. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే రూ.46,800 వరకు పన్ను ఆదా చేసుకోగలుగుతారు. 


ఎన్‌పీఎస్‌,ఈపీఎ్‌ఫతో రిటైర్మెంట్‌ నిధి

దేశంలో ఐటీ చట్టం సెక్షన్‌ 80 సి కింద పన్ను ఆదాకు అత్యంత ఆమోదనీయత పొందిన పథకాల్లో ఎన్‌పీఎస్‌ ఒకటి. ఎన్‌పీఎ్‌సలో ఏడాదికి రూ.1.5 లక్షల  గరిష్ఠ పరిమితి వరకు పన్ను రిబే టు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు ఎన్‌పీఎ్‌సలో పొదుపు చేయడం ద్వారా రిటైర్మెంట్‌ నిధి పోగు చేసుకోవచ్చు. అలాగే 80సీసీ డీ సెక్షన్‌ కింద ఎన్‌పీఎస్‌ ఖాతా స్వభావాన్ని బట్టి ఏడాదికి అదనంగా రూ.50 వేల వరకు కూడా రిబేటు పొందవచ్చు. అంటే మొత్తం రూ.2 లక్షల వరకు రిబేటు వస్తుంది. 

ఒకవేళ ఎన్‌పీఎ్‌సలో పొదుపు చేయడం ఇష్టం లేకపోతే ఈపీఎఫ్‌ ఖాతాకు మీ వాటా కూడా పెంచుకోవచ్చు. చట్టం ప్రకారం యాజమాన్యం మినహాయించే ఈపీఎఫ్‌ మొత్తానికి ఇది అదనంగా ఉంటుంది. ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేసే సొమ్ముపై కూడా ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు రిబేటు పొందవచ్చు.


80సీ సెక్షన్‌ కింద ఇతర అవకాశాలు

ఈ సెక్షన్‌ కింద పన్ను మినహాయింపు పొందగల ఇతర పెట్టుబడుల్లో పీపీఎఫ్‌, జాతీయ పొదుపు సర్టిఫికెట్లు (ఎన్‌ఎ్‌ససీ), ఐదేళ్ల పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్లు, యూనిట్‌ అనుసంధానిత బీమా ప్లాన్లు (యులిప్‌), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎ్‌సవై) పెట్టుబడులు, 5 ఏళ్ల కాలపరిమితి గల పన్ను ఆదా అందించే ఎఫ్‌డీలు ఉన్నాయి. ఎవరికేది సరిపోతుందో పరిశీలించుకుని పొదుపు చేయవచ్చు.


టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ 

తమపై ఆధారపడిన వారికి సంపూర్ణ రక్షణ కల్పించడమే ప్రతి ఒక్కరి ప్రధాన లక్ష్యం. కేవలం రిస్క్‌ను మాత్రమే కవర్‌ చేసే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లు ఈ లక్ష్యం నెరవేర్చుకునేందుకు సహాయపడతాయి. దీని ద్వారా పాలసీదారులు జీవిత కాలానంతరం సైతం కుటుంబానికి రక్షణ కల్పించగలుగుతారు. కేవలం రిస్క్‌ను మాత్రమే కవర్‌ చేస్తాయి గనుక అతి తక్కువ ప్రీమియంతో వార్షిక వేతనంపై 15 నుంచి 20 రెట్ల కవరేజీ పొందవచ్చు. వీటికి చెల్లించే ప్రీమియంలపై ఐటీ చట్టం 80సీ సెక్షన్‌ కింద మినహాయింపు పొందవచ్చు. 


ఆరోగ్య బీమా

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది నానుడి. ఇందుకు దీటుగానే ఆరోగ్య బీమా పథకాలపై చెల్లించే ప్రీమియంలకు ఐటీ సెక్షన్‌ 80 డీ పన్ను మినహాయింపు అందిస్తోంది. పాలసీదారుడు, భార్య/భర్త, సంతానం, తల్లిదండ్రుల కోసం చెల్లించే ప్రీమియంపై కూడా మినహాయింపు ఉంది. తల్లిదండ్రుల కోసం తీసుకునే ఆరోగ్య బీమాపై అదనంగా రూ.25,000 వరకు కూడా మినహాయింపు పొందవచ్చు. వయోవృద్ధులకు ఈ మినహాయింపు రూ.50,000 వరకు ఉంది. అంటే కుటుంబ సభ్యులందరికీ కవరేజీ కల్పించడం ద్వారా రూ.75 వేల వరకు మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవచ్చన్న మాట. అలాగే పాలసీదారుడు కూడా వయోవృద్ధుడై ఉండి తల్లిదండ్రులకు కూడా కవరేజీ కల్పిస్తుంటే రూ.1 లక్ష వరకు మినహాయింపు పొందవచ్చు.

Updated Date - 2020-10-04T06:20:06+05:30 IST