అదరగొట్టిన సుందర్, అక్షర్.. భారత్‌కు భారీ ఆధిక్యం!

ABN , First Publish Date - 2021-03-06T16:55:58+05:30 IST

మెుతేరా వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఆఖరిదైన నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది.

అదరగొట్టిన సుందర్, అక్షర్.. భారత్‌కు భారీ ఆధిక్యం!

అహ్మదాబాద్: మెుతేరా వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఆఖరిదైన నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది. 294/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 71 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్(96 నాటౌట్), అక్షర్ పటేల్(43)  ద్వయం ఎనిమిదో వికెట్‌కు శతక(106) భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. అక్షర్ రనౌట్‌గా వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాంత్, సిరాజ్ వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టడంతో సుందర్ సెంచరీకి 4 పరుగుల దూరంలో ఉండిపోయాడు. అంతకుముందు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్(101) శతకంతో కోహ్లీ సేన భారీ స్కోర్‌కు పునాది వేయగా.. అక్షర్, సుందర్ జోడి దానిని కొనసాగించింది. దీంతో టీమిండియా 365 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు 160 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4 వికెట్లు పడగొట్టగా.. అండర్సన్ 3, జాక్ లీచ్ 2 వికెట్లు తీశారు.  


Updated Date - 2021-03-06T16:55:58+05:30 IST