మండలానికి చెరొకటి

ABN , First Publish Date - 2020-07-01T10:20:28+05:30 IST

అత్యవసర వైద్య సేవల్లో కొత్తగా అందు బాటులోకి తెస్తున్న 108, 104 అంబులెన్స్‌ సర్వీసు వాహనాలు బుధవారం జిల్లాలో ప్రారంభం

మండలానికి చెరొకటి

జిల్లాకు కొత్తగా 104 వాహనాలు 48

108 అంబులెన్స్‌లు 25 కేటాయింపు.. నేడు ప్రారంభం

నవజాత శిశువులకు 2 అంబులెన్స్‌లు


ఏలూరు ఎడ్యుకేషన్‌, జూన్‌ 30 : అత్యవసర వైద్య సేవల్లో కొత్తగా అందు బాటులోకి తెస్తున్న 108, 104 అంబులెన్స్‌ సర్వీసు వాహనాలు బుధవారం జిల్లాలో ప్రారంభం కానున్నాయి. విజయవాడలో ఉదయం ఈ వాహనాలను  సీఎం జగన్‌ ప్రారంభించిన అనంతరం జిల్లాకు నిర్దేశించినవన్నీ ఏలూరుకు చేరుకుంటాయి. వీటిని కలెక్టర్‌, డీఎంహెచ్‌వో, ఇతర అధికారులతోపాటు, ఆయా మండలాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారు. అత్యవసర వైద్య సేవలు అవసరమైనప్పుడు లేదా ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు పట్టణ ప్రాంతాల్లో కాల్‌ చేసిన 20 నిమిషాల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 25 నిమిషా ల్లోగా చేరుకుని అత్యవసర వైద్య సేవలందించేలా ఏర్పాట్లు చేశారు. ఈ అంబు లెన్స్‌ సర్వీసుల్లో వైద్యసేవలు, వాహనాల పర్యవేక్షణ, నిర్వహణ వంటివన్నీ అర బిందో ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ నియంత్రణలో జరుగుతాయి.


జిల్లాకు 104 అంబులెన్స్‌లు ఒక్కో మండలానికి ఒకటి చొప్పున 48 కొత్త వాహనాలు, 108 అంబులెన్స్‌లు మరో 25 కేటాయించారు. ఇప్పటికే వైద్య సేవలందిస్తున్న 23 అంబులెన్స్‌లకు అదనంగా 25 సమకూర్చారు. ఒక్కో 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌లో ఒక మెడికల్‌ ఆఫీసర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, డ్రైవర్‌, ఎఎన్‌ఎంతో పాటు ఆశ వర్కర్‌ ఉంటారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వీటిని అనుసంఽ దానం చేసి మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తారు. రోగులకు అవసరమైన పరీక్షలు చేసి ఔషధాలను ఉచితంగా అందజేస్తారు. కొత్తగా ప్రారంభించే వైఎస్‌ఆర్‌ రహదారి భద్రతా కార్యక్రమాన్ని 108 అంబులెన్స్‌ సర్వీసులకు అనుసంధానం చేశారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి ఈ కార్యక్రమం ద్వారా ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలందిస్తారు. రెండు రోజులపాటు లేదా గరిష్టంగా రూ.50 వేల వరకూ వైద్య సేవలు అందిం చనున్నారు. నెలలు నిండకుండా జన్మించిన నవజాత శిశువుల కోసం ప్రత్యేకం గా రూపొందించిన నియోనేటల్‌ అంబులెన్స్‌లను కొవ్వూరు, నరసాపురాలకు రెండు కేటాయించారు. 


గరిష్ట స్థాయిలో వైద్య సేవలు 

108 సర్వీసుల నిమిత్తం ఇప్పటి వరకూ రోజుకు నాలు గు వేల వరకూ కాల్స్‌ వస్తున్నాయి. వీటన్నింటికి హాజరై అత్యవసర వైద్య సేవలందించేందుకు ఈ వాహనాలను పూర్తి స్థాయిలో వినియోగిస్తాం. ప్రతి మండల కేంద్రంలో ఒక 104 వాహనం ఉంటుంది. ఏలూరు నగరపాలక సంస్థతోపాటు తొమ్మిది మునిసిపల్‌ పట్టణాల్లో ఏఎల్‌ఎస్‌ సదుపాయం ఉన్న 108 వాహనాలను వినియోగిస్తాం. మిగతా వాటిలో బేసిక్‌ లైఫ్‌ సపోర్టు(బీఎల్‌ఎస్‌) సదుపాయం ఉండే 108 వాహనాల ను ఏర్పాటుచేస్తాం. ఇవికాక కొవ్వూరు, నరసాపురాల్లో నియో నేటల్‌ అంబులెన్స్‌ వాహనాలను అందుబాటులో ఉంచుతాం. 

- కె.గణేశ్‌, జిల్లా మేనేజర్‌, అరబిందో ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ (108/104)

Updated Date - 2020-07-01T10:20:28+05:30 IST