Abn logo
Dec 2 2020 @ 23:55PM

భవన నిర్మాణాలకు రూ.453 కోట్లు

డ్వామా పీడీ నాగేశ్వరరావు

పాచిపెంట : జిల్లాలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు తదితర భవన నిర్మాణాలకు రూ.453 కోట్లు మంజూరైనట్టు డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం పాచిపెంటలో గ్రామ సచివాలయం భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. జిల్లాలో 664 గ్రామ సచివాలయాలు మంజూ రవ్వగా... వీటిలో 624 భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. మిగిలినవి ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభమవుతాయన్నారు. 618 రైతు భరోసా కేంద్రాలకు గాను 58 భవనాల పనులు ప్రారంభించలేదన్నారు. సబ్‌ సెంటర్లకు సంబంధించి 490 భవనాలకు గాను 129 భవన నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి.రామారావు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

 

 

Advertisement
Advertisement
Advertisement