భువనగిరి మునిసిపాలిటీకి రూ.4.50 కోట్లు

ABN , First Publish Date - 2021-07-31T06:03:04+05:30 IST

భువనగిరి మునిసిపాలిటీకి రూ.4.50కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర మునిసిపల్‌ పరిపాల నా విభాగం ఉత్తర్వులు జారీచేసింది.

భువనగిరి మునిసిపాలిటీకి రూ.4.50 కోట్లు

భువనగిరి టౌన్‌, జూలై 30: భువనగిరి మునిసిపాలిటీకి రూ.4.50కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర మునిసిపల్‌ పరిపాల నా విభాగం ఉత్తర్వులు జారీచేసింది. పట్టణంలో రూ.8.60కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కు పట్టణ ప్రగతి నిధులను మళ్లించడంతో పట్టణాభివృద్ధికి విఘాతం ఏర్పడింది. ఈనేపథ్యంలో నిధుల మళ్లింపు అంశాన్ని పట్టణ ప్రగతి ప్రారంభోత్సవానికి వచ్చిన సీడీఎంఏ సత్యనారాయణ దృష్టికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన నిధులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల వినియోగంపై కౌన్సిల్‌ సమావేశంలో చర్చించి కలెక్టర్‌ ఆమోదంతో అవసరమైన పనులు చేపట్టాలని మునిసిపల్‌ అధికారులకు సూచించారు. 

Updated Date - 2021-07-31T06:03:04+05:30 IST