జిల్లాకు 45 వేల డోసుల వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-04-19T05:28:14+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 45 వేల డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను పంపించినట్లు డీఎంహెచ్‌వో డా.బి.రామగ్డియ్య, డీఐవో డా.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

జిల్లాకు 45 వేల డోసుల వ్యాక్సిన్‌

  1.  నేడు ఫ్రంట్‌లైన్‌, హెల్త్‌కేర్‌ వర్కర్లకు టీకాలు 


కర్నూలు(హాస్పిటల్‌), ఏప్రిల్‌ 18: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 45 వేల డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను పంపించినట్లు డీఎంహెచ్‌వో డా.బి.రామగ్డియ్య, డీఐవో డా.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం అర్ధరాత్రి వ్యాక్సిన్‌ ఇమ్యూనైజేషన్‌ కార్యాలయానికి చేరిందని కొవిషిల్డ్‌ 39,500 డోసులు, 6500 కోవాగ్జిన్‌ డోసులు వచ్చాయని తెలిపారు. సోమవారం హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లందరికీ వ్యాక్సిన్‌ వేస్తారని, సాధారణ ప్రజలకు వ్యాక్సిన్‌ వేయరని తెలిపారు. పీహెచ్‌సీలో పని చేస్తూ ఇంతవరకూ టీకాలు వేయించుకోని వారు తప్పక వ్యాక్సినేషన్‌ వేసుకోవాలని, లేకపోతే పీహెచ్‌సీ సిబ్బందిని విధులకు దూరంగా పెడుతామని డీఎంహెచ్‌వో హెచ్చరించారు. మంగళశారం రెండో డోసు కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను వేస్తామని తెలిపారు.

Updated Date - 2021-04-19T05:28:14+05:30 IST