45వేల ఉద్యోగాల భర్తీ

ABN , First Publish Date - 2022-02-18T17:28:52+05:30 IST

నిరుద్యోగుల కల నేరవేరనుంది. రాష్ట్రంలో కొన్ని నెలల కాలంగా పలు కారణాలతో వాయిదాలు పడుతూ వస్తున్న ఉద్యోగాల భర్తీని అమలు చేస్తామని 45 వేల ఉద్యోగులను నియమిస్తామని సీఎం బసవరాజ్‌ బొమ్మై స్పష్టం

45వేల ఉద్యోగాల భర్తీ

          - త్వరలో ఉపాధ్యాయ, పోలీసు శాఖల్లో నియామకాలకు నోటిఫికేషన్లు: Cm


బెంగళూరు: నిరుద్యోగుల కల నేరవేరనుంది. రాష్ట్రంలో కొన్ని నెలల కాలంగా పలు కారణాలతో వాయిదాలు పడుతూ వస్తున్న ఉద్యోగాల భర్తీని అమలు చేస్తామని 45 వేల ఉద్యోగులను నియమిస్తామని సీఎం బసవరాజ్‌ బొమ్మై స్పష్టం చేశారు. గురువారం విధానపరిషత్‌లో ప్రశ్నోత్తరాల వేళ జేడీఎస్‌ సభ్యుడు శ్రీకంఠేగౌడ, అరుణ్‌ శెహపుర, ఆర్‌ దేవేగౌడలు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. 15వేలమంది ఉపాధ్యాయులను, 16వేలమంది పోలీసుల నియామక ప్రక్రియ సాగుతోందన్నారు. కల్యాణ కర్ణాటక పరిధిలో 14వేల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, పోలీసుల నియామక ప్రక్రియలు కొనసాగుతున్నాయన్నారు. కొవిడ్‌తోపాటు ఆర్థిక సమస్యలకు కొన్నేళ్లుగా ఉద్యోగాల నియామక ప్రక్రియ జరగలేదన్నారు. అనివార్యమైన పోస్టులు మాత్రమే భర్తీ చేశామన్నారు. రానున్న రోజుల్లో పదవీ విరమణలు కొనసాగుతాయని ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉంటే విద్య, భద్రతతోపాటు మరిన్ని సమస్యలు తలెత్తనున్నాయని అందుకే భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర, కేంద్రప్రభుత్వ ఉద్యోగుల వేతనాల తారతమ్యం గతంలోనుంచి కొనసాగుతోందన్నారు. ఏడవ వేతన కమిషన్‌ ఏర్పాటు చేశామని, ఆ రవ వేతన క మిషన్‌ అమలులో ఉందన్నారు. 2022 -23 సంవత్సరంలోనే ఏడవ వేతన కమిషన్‌ అమలు చేయదలిచామన్నారు. ఉద్యోగులకు వేతనాలు, పదోన్నతులను స మస్య లేకుండా చేస్తామన్నారు. వేతన సమస్య పెనుభారం కారాదని భావిస్తున్నామన్నారు. 

Updated Date - 2022-02-18T17:28:52+05:30 IST