భూ రిజిస్ట్రేషన్‌కు 4.5 లక్షలు లంచం

ABN , First Publish Date - 2022-08-19T07:34:43+05:30 IST

భూమి రిజిస్ట్రేషన్‌చేసేందుకు రూ.2.5 లక్షల లంచం తీసుకుంటూ మెదక్‌ జిల్లా చేగుంట డిప్యూటీ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ ఏసీబీకి పట్టుబడ్డారు.

భూ రిజిస్ట్రేషన్‌కు 4.5 లక్షలు లంచం

అడ్వాన్స్‌గా రూ.2.5 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన చేగుంట డిప్యూటీ తహసీల్దార్‌

స్టేషన్‌ బెయిల్‌కు లంచం.. ఏసీబీకి చిక్కిన హెడ్‌కానిస్టేబుల్‌ 

3 గంటల్లో ఏసీబీ వలలో 4 అవినీతి చేపలు! ఈ ఏడాదిలో ఇప్పటివరకు 61 అవినీతి కేసులు

ఏసీబీ కేసుల్లో టాప్‌-1లో ట్రాన్స్‌కో.. ఆ తర్వాత రెవెన్యూ శాఖ

అవినీతిలో దక్షిణాదిలో నం.1.. దేశంలో ఐదో స్థానంలో తెలంగాణ

ఇండియా కరప్షన్‌ గత సర్వేలో వెల్లడి


చేగుంట, ఆగస్టు 18: భూమి రిజిస్ట్రేషన్‌చేసేందుకు రూ.2.5 లక్షల లంచం తీసుకుంటూ మెదక్‌ జిల్లా చేగుంట డిప్యూటీ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. చేగుంట మండలం రాంపూర్‌ శివారులోని సర్వే నంబర్‌ 122లో ఐదెకరాల భూమి కొనుగోలుకు హైదరాబాద్‌కు చెందిన రఘునాథ్‌రెడ్డి ఒప్పందం చేసుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో పరిశీలించగా.. తనకు ఆ భూమిని అమ్మజూపిన పట్టాదారుల పేరిట 33 గుంటల భూమి ఉందని.. 3 ఎకరాలు ఇతరుల పేరిట ఉండగా, దానిపై కోర్టులో కేసు నడుస్తోందని తెలిసింది. మరో ఎకరా ఎవరి పేరిటా లేదని వెల్లడైంది. దీంతో.. పట్టాదారుల పేరిట ఉన్న 33 గుంటలు, ఎవరి పేరిటా లేని ఎకరా భూమిని తనపేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని రఘునాథరెడ్డి భావించారు. డిప్యూటీ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ను సంప్రదించగా.. రిజిస్ట్రేషన్‌ చేసేందుకు రూ.ఐదు లక్షలు డిమాండ్‌ చేశారు. గురువారం డిప్యూటీ తహసీల్దార్‌కు రూ.2.50 లక్షలు, మధ్యవర్తిగా ఉన్న అనిల్‌కు రూ.20వేలు కలిపి రూ.2.7 లక్షలు ఇచ్చారు. వెంటనే తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ అదికారులు దాడిచేసి చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-08-19T07:34:43+05:30 IST