Advertisement
Advertisement
Abn logo
Advertisement

44 ఏళ్ల మహిళ అదృశ్యం.. 23 రోజుల తర్వాత పక్కింటి వంటింట్లో తవ్వితే దొరికిన మృతదేహం.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆమె వయసు 44. పేరు సింధు. ఆమెకు పన్నెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. భర్తతో మనస్పర్ధల కారణంగా విడిపోయింది. ఆ తర్వాత కొడుకుతో కలిసి ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో పక్కింట్లో ఉండే మనిక్కునెల్ బెనాయ్ అనే 48 ఏళ్ల వ్యక్తితో ఆమెకు పరిచయం అయింది. ఆ పరిచయం పెరగడంతో అతనితో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. కొడుకుతో సహా బెనాయ్ ఇంటికి వెళ్లి ఉంటోంది. ఈ క్రమంలో ఆగస్టు 11న మొదటి భర్తను కలవడానికి ఆమె బయలు దేరింది. అతను కేన్సర్ పేషెంట్ కావడంతో పరామర్శించడానికి వెళ్తానని సింధు అన్నది. దీనికి బెనాయ్ ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన బెనాయ్.. సింధు కుమారుడికి ఉరేయడానికి ప్రయత్నించాడు. దీంతో బెదిరిపోయిన సింధు.. తన కుమారుడిని బెనాయ్ చుట్టాలింటికి పంపేసింది.


ఆ తర్వాత ఆగస్టు 12 నుంచి సింధు కనిపించకుండా పోయింది. ఇది గమనించిన సింధు కుమారుడు.. తల్లి కనిపించడం లేదని అమ్మమ్మకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలిసిన బెనాయ్ ఇంటి నుంచి పారిపోయాడు. దర్యాప్తులో భాగంగా సెప్టెంబరు 3న సింధు మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. ఆమెను తీవ్రంగా కొట్టి చంపిన బెనాయ్.. మృతదేహాన్ని ఇంట్లోని మట్టిపొయ్యి కింద పూడ్చిపెట్టినట్లు సమాచారం. మృతదేహం కింద మిరపకాయలు చల్లి పూడ్చిపెట్టాడు. ఆపై రెండ్రోజులపాటు అదే పొయ్యిపై వండుకొని తిన్నట్లు తెలుస్తోంది. సింధు మొహాన్ని కవరుతో చుట్టేశాడు. పోస్టుమార్టంలో ఆమె పక్కటెముకలు కూడా విరిగినట్లు తెలిసింది. ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక ప్రకారం, సింధును గొంతు పిసికి చంపినట్లు సమాచారం. ఈ మృతదేహాన్ని పోలీసులు కూడా కనిపెట్టలేదని, కుటుంబ సభ్యులే దాన్ని గుర్తించారని సింధు కుటుంబం ఆరోపిస్తోంది. పరారీలో ఉన్న బెనాయ్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement