తిరుమలలో 44

ABN , First Publish Date - 2020-07-07T08:26:04+05:30 IST

తిరుమల కొండపై కరోనా వైరస్‌ పంజా విసిరింది. ఒకేరోజు 44 కేసులు బయటపడడం కలకలం ..

తిరుమలలో 44

ఒక్కసారిగా బయటపడిన కేసులు

విజిలెన్స్‌ అధికారి సహా భద్రతా సిబ్బందికి వైరస్‌

బాధితుల్లో పలువురు ఉద్యోగులు, స్థానికులు

దాచినా దాగని వైరస్‌!


తిరుపతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): తిరుమల కొండపై కరోనా వైరస్‌ పంజా విసిరింది. ఒకేరోజు 44 కేసులు బయటపడడం కలకలం రేపింది. చిత్తూరు జిల్లాలో ఆదివారం రికా ర్డు స్థాయిలో 142 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో తిరుమల చిరునామాలతో 44 కేసులు ఉన్నాయి. టీటీ డీ విజిలెన్స్‌ విభాగానికి చెందిన అధికారితో పాటు ఎపీఎస్పీ 14వ బెటాలియన్‌కు చెందిన ఆర్‌ఎ్‌సఐ, ఏఆర్‌ఎ్‌సఐ, నలుగు రు హెడ్‌కానిస్టేబుళ్లు, 14 మంది కానిస్టేబుళ్లు, కుక్‌ తదితర 22 మంది వైరస్‌ సోకిన వారిలో ఉన్నారు. బాధితుల్లో తిరుమ ల స్థానికులతోపాటు భక్తులు సైతం ఉండే అవకాశాన్ని కొట్టిపారవేయలేం. ఇక, తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయ ఉద్యోగి ఒకరు వైరస్‌ బారిన పడినప్పుడు ఆ ఆలయంలో దర్శనాలు 2 రోజుల పాటు నిలిపేశారు. కొండపై ఉద్యోగులకు వైరస్‌ సోకిన విషయమై నోరు మెదపలేదు. తొలిసారి కలెక్టర్‌ భరత్‌ గుప్తా నాలుగు రోజుల క్రితం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో ఓ అర్చకుడు, మంగళవాయిద్యకారులు, భద్రతా సిబ్బంది, ఉద్యోగులూ కలిపి పది మందికి కరో నా సోకినట్టు వెల్లడించారు. ఆ తర్వాత టీటీడీ ఈ విషయాన్ని వెల్లడించక తప్పలేదు. టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వై.వీ.సుబ్బారెడ్డే స్వయంగా 17 మందికి వైరస్‌ సోకినట్టు ప్రకటించారు. 


నామమాత్రంగా ర్యాండమ్‌ టెస్టులు

తిరుమలకు రోజుకు 9 నుంచి 12 వేల మంది భక్తులు వస్తున్నారు. రోజూ భక్తుల్లో వంద మందికి ర్యాండమ్‌గా కరో నా టెస్టులు చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకూ 2500 మందికి టెస్టులు చేసి ఉండాలి. అలిపి రి టోల్‌గేట్‌లో రోజుకు 80-120 మందికి టెస్టులు నిర్వహిస్తున్నారు. కానీ వారిలో భక్తుల సంఖ్య అత్యల్పంగా ఉంటోంది. గత 25 రోజుల్లో మొత్తం 1700 శాంపిల్స్‌ సేకరించగా అం దులో భక్తులవి 500 లోపేనని విశ్వసనీయ సమాచారం. శ్యాంపిల్స్‌ సేకరించాక వాటి ఫలితాలు ఎప్పుడు వస్తాయో, ఎందరికి నెగెటివ్‌ వచ్చింది. పాజిటివ్‌ వచ్చిన కేసులు ఎన్ని అనే వివరాలేవీ టీటీడీ వెల్లడించడం లేదు. మరోవైపు విధుల్లో ఉన్న సహచరులకు వైరస్‌ సోకుతుండడంతో ఇతర ఉద్యోగు లు, ముఖ్యంగా భద్రతా సిబ్బందిలో భయాందోళ ఎక్కువైంది. 


ఉద్యోగులకు కరోనా పరీక్షలు ముమ్మరం: ఈవో

టీటీడీ ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా చేయాలని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. అవసరమైన ట్రూనాట్‌ మెషిన్లను కొనుగోలు చేయాలని కోరారు. సోమవారం ఆయన అదనపు ఈవో, జేఈవో, కలెక్టర్‌తో సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఉద్యోగుల క్యాంటీన్‌లో వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆహారం ఉచితంగా అందించాలని సూచించారు. 

Updated Date - 2020-07-07T08:26:04+05:30 IST