మరో 155

ABN , First Publish Date - 2020-07-12T09:51:49+05:30 IST

జిల్లాలో శనివారం 155 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలో 49 కేసులు కాగా జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో

మరో 155

అత్యధికంగా మంగళగిరిలో 43

గుంటూరు నగరంలో 49

వ్యాధి తీవ్రతతో ముగ్గురు మృతి 

  

గుంటూరు (మెడికల్‌) జూలై 11: జిల్లాలో శనివారం 155 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలో 49 కేసులు కాగా జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో 106 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా మంగళగిరిలో 43 కేసులు, నర్సరావుపేటలో 21 కేసులు వెలుగు చూశాయి. కరోనా పరీక్షలు చేసే ల్యాబ్‌కు శుక్రవారం సెలవు కావడంతో ల్యాబ్‌లో రసాయన శుద్ధి నిర్వహించారు. దీంతో కేసుల సంఖ్య తగ్గినట్లు భావిస్తున్నారు. దాచేపల్లిలో, దుగ్గిరాల, గుంటూరు రూరల్‌, గురజాల, ఈపూరు, క్రోసూరు, ముప్పాళ్ల, మాచర్ల, రొంపిచర్ల, శావల్యాపురం, తెనాలి, తుళ్లూరు, వినుకొండలో ఒక్కో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కారంపూడి, పిడుగురాళ్ల, రాజుపాలెంలో రెండేసి కేసులు, ప్రత్తిపాడు, తాడికొండలో మూడేసి కేసులు, సత్తెనపల్లిలో 4, తాడేపల్లిలో 10 కేసులు నమోదయాయి. 


గుంటూరు నగరంలో..

పాతగుంటూరు, ఆనందపేట, అరండల్‌పేట, ఏటీ అగ్రహారం, భారత్‌పేట, గుజ్జనగుళ్ల, గూండారావుపేట, అంకమ్మ నగర్‌, లక్ష్మీపురం, లాలాపేట, నగరంపాలెం, సాయినగర్‌, అరుంధతినగర్‌, రెడ్లబజార్‌, శ్రీనివాసరావుతోట, నవభారత్‌నగర్‌, శ్యామలానగర్‌, వసంతరాయపురం, బొంగరాలబీడు, విద్యానగర్‌, డీఎస్‌ నగర్‌, యాదవబజార్‌, యతిరాజుకాలనీ, చంద్రమౌళీ నగర్‌లో ఒక్కో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సంగడిగుంట, సంజీవయ్య నగర్‌, సుద్దపల్లి డొంక, బాలాజీ నగర్‌, నల్లచెరువు, కొరిటెపాడులో రెండేసి కేసులు, శ్రీనగర్‌, రామిరెడ్డి నగర్‌లో మూడేసి కేసులు నమోదయ్యాయి. తెలంగాణ నుంచి వచ్చిన వారిలో గుంటూరు అర్బన్‌ పరిధిలో మూడు కేసులు నమోదు కాగా, క్వారంటైన్‌ కేంద్రాల్లో మరో 5 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. శనివారం జిల్లాలో మూడు కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు జిల్లాలో కొవిడ్‌-19 మరణాల సంఖ్య 29కి చేరింది. గుంటూరు నగరంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటలకే దుకాణ సముదాయాలను మూసివేశారు 


 కొత్తగా 23 కంటైన్మెంట్‌ జోన్లు

జిల్లాలో మొత్తం 23 ప్రాంతాలను కొత్తగా కంటైన్మెంట్‌ జోన్లుగా కలెక్టర్‌ నోటిఫై చేశారు. బ్రాడీపేట, చౌత్రా, కోబాల్డ్‌పేట, ఎల్‌బీ నగర్‌, శ్రీనగర్‌, సంజీవయ్యనగర్‌, శ్రీనివాసరావుతోట, రామిరెడ్డితోట, ఐపీడీ కాలనీ, చౌడవరం, వెల్లటూరు, పెదమక్కెన, వెంగళాయపాలెం, నల్లపాడు, మున్నంగి, గోరంట్ల, మందపాడు, కొత్తపేట, మోదుకూరు, దిండిపాలెం, సాలిపేట, షరాఫ్‌బజార్‌, మారీస్‌పేటలలో కంటైన్మెంట్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తారు.  


మంగళగిరిలో శనివారం ఒక్కరోజే 43 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య మూడంకెలను చేరుకుంది. ఎల్బీ నగర్‌, యిప్పటం రోడ్డు, భార్గవపేట, ఇందిరానగర్‌, కుప్పురావు కాలనీ, పాతమంగళగిరి ఎన్‌సీసీ రోడ్డు, టిప్పర్ల బజారు ఏరియాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా వుంది. నాల్గవ వార్డులో ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్టు చెబుతున్నారు. పట్టణంలో ఇప్పటివరకు 106 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.  8, 9 వార్డులు, కుప్పురావు కాలనీ, టిప్పర్ల బజారు, బాపనయ్య నగర్‌, 17, 19 వార్డుల్లో లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో అమలవుతుందని మునిసిపల్‌ కమిషనరు కే.హేమమాలినిరెడ్డి తెలిపారు. తహసీల్దారు రామ్‌ప్రసాద్‌, ఎస్‌ఐ నారాయణ తదితరులు శనివారం మెయిన్‌ బజారులో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.


తాడేపల్లి మండల, పట్టణ పరిధిలో శనివారం 10 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఉండవల్లి గ్రామంలో 5, మణిపాల్‌ ఆస్పత్రిలో టెస్టులు చేయించుకున్న ఇద్దరికి, బైపాస్‌ ఏరియాలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు తెలిపారు.  


నరసరావుపేట పట్టణంలో శనివారం కొత్తగా 21 మందికి కరోనా నిర్ధారించారు. క్రిష్టియన్‌ పాలెం,. ప్రకాస్‌ నగర్‌లలో ఇరువురు వ్యక్తులు మృతి చెందారు. వీరికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ నమోదైనట్లు స్థానిక వైద్యులు నిర్ధారించారు. రామిరెడ్డిపేట, పాతూరు, ఏనుగుల బజార్‌, సాయినగర్‌, చంద్ర బాబు నాయుడు కాలనీ, శ్రీరాంపురం, బరంపేట ప్రాంతాలలో కొత్తగా కేసులు నమోదయ్యాయి. శ్రీరాంపురంలో ఓ గర్భిణికి కరోనా నమోదైంది. కేసుల సంఖ్య 350కి చేరింది. 2 గంటల తర్వాత షాపులు తెరచి ఉంటే జరిమానాలు విధిస్తామని కమీషనర్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. పల్నాడులో ఓ రెవెన్యూ ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు వైద్యాధికారిణి భువనేశ్వరి తెలిపారు.  

 

Updated Date - 2020-07-12T09:51:49+05:30 IST