గల్ఫ్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన 4 లక్షల పైచిలుకు భారతీయులు..

ABN , First Publish Date - 2022-07-23T02:53:19+05:30 IST

కరోనా సంక్షోభం కారణంగా 4,23,559 మంది భారతీయ కార్మికులు ఈసీఆర్(ECR) దేశాల నుంచి స్వదేశానికి తిరిగొచ్చారని కేంద్రం తాజాగా వెల్లడించింది.

గల్ఫ్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన 4 లక్షల పైచిలుకు భారతీయులు..

ఎన్నారై డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా 4,23,559 మంది భారతీయ కార్మికులు ఈసీఆర్(ECR) దేశాల నుంచి స్వదేశానికి తిరిగొచ్చారని కేంద్రం తాజాగా వెల్లడించింది.  2020 జూన్ నుంచి 2021 డిసెంబర్ మధ్యకాలంలో వీరు స్వదేశానికి చేరుకున్నట్టు తెలిపింది. వీరిలో సగానికంటే ఎక్కువ మంది యూఏఈ, సౌదీలో పనిచేసేవారని వెల్లడించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ గురువారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు. ఎమిగ్రేషన్ యాక్ట్-1983 ప్రకారం.. ఈసీఆర్ పాస్‌పోర్టు కలిగిన వారు గల్ఫ్‌ దేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లాలనుకుంటే..ముందుగా ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ కార్యాలయం నుంచి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మొత్తం 18 దేశాలకు వెళ్లేందుకు ఈసీఆర్ క్లియరెన్స్ అవసరం కాగా.. వీటిలో దాదాపు అన్ని గల్ఫ్ దేశాలే! ఇక పదవ తరగతి కంటే తక్కువ చదువుకున్న వారికి ఈసీఆర్ పాస్‌పోర్టు ఇస్తారు. 


కాగా.. కరోనా సంక్షోభంలో గల్ఫ్ ఉద్యోగాలు పొగొట్టుకున్ని స్వదేశానికి చేరుకున్న భారతీయులను ఆదుకొనేందుకు తాము కృషి చేసినట్టు మంత్రి వి. మురళీధరన్ రాజ్యసభలో పేర్కొన్నారు. ‘‘ఈ దిశగా కేంద్రం ప్రభుత్వంలోని వివిధ శాఖలు గల్ఫ్ దేశాల ప్రభుత్వాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ భారతీయ కార్మికులకు రావాల్సిన జీతనాతాలు అందేలా, వారు సంక్షేభం కోసం కృషి చేస్తున్నాయి’’ అని విదేశాంగ శాఖ సహాయమంత్రి వి. మురళీధరన్ రాజ్యసభలో పేర్కొన్నారు. వందేభారత్ మిషన్‌లో భాగంగా విదేశాంగ శాఖ..  పౌర విమానయాన శాఖ సహకారంతో వివిధ దేశాల్లోని భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తరలించిందన్నారు. 

Updated Date - 2022-07-23T02:53:19+05:30 IST