బూస్టర్ డోసుకు వారంతా నో!

ABN , First Publish Date - 2022-02-06T01:13:45+05:30 IST

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వం ఇప్పుడు బూస్టర్ డోసులపై మరింతగా దృష్టిసారించింది

బూస్టర్ డోసుకు వారంతా నో!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వం ఇప్పుడు బూస్టర్ డోసులపై మరింతగా దృష్టిసారించింది. అయితే, తాజాగా ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యకర విషయం వెలుగుచూసింది. అర్హులైన వారిలో దాదాపు 42 శాతం మంది బూస్టర్ డోసు తీసుకునేందుకు ఇష్టం చూపడం లేదన్న విషయం ఈ సర్వేలో బయటపడింది.


ఫిబ్రవరి 3వ తేదీ వరకు దేశంలో 1.25 కోట్ల మంది మాత్రమే బూస్టర్ డోసు తీసుకున్నట్టు ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. బూస్టర్ డోసుకు అర్హులైన వారిలో 29 శాతం మంది ప్రస్తుం కొవిడ్‌తో బాధపడుతున్నారు. దీంతో ఆ తర్వాత బూస్టర్ డోసు వేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. మరో 29 శాతం మంది రోజు వారీ కేసుల సంఖ్య ఎప్పుడు తగ్గుతుందా? అని ఎదురుచూస్తున్నారు. 14 శాతం మంది బూస్టర్ డోసు వేసుకోబోమని తేల్చి చెప్పగా, 29 శాతం మంది దీనిపై మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

 

బూస్టర్ డోసుపై సరైన సమాచారం లేకపోవడం, సంశయం, తప్పుడు సమాచారం, పుకార్లు వంటి వాటి కారణంగా చాలామంది బూస్టర్ డోసు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నట్టు సర్వే పేర్కొంది. అంతేకాదు, బూస్టర్ డోసు వల్ల ఏమంత ఉపయోగం లేదంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులు కూడా ఇందుకు మరో కారణమని తెలిపింది.  

Updated Date - 2022-02-06T01:13:45+05:30 IST