జిల్లాకు చేరిన 415 ఆక్సిజన్‌ సిలిండర్లు

ABN , First Publish Date - 2021-07-24T05:05:07+05:30 IST

ఏపీ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ( ఏపీఎంఐడీసీ) నుంచి 415 ఆక్సిజన్‌ సిలిండర్లు జిల్లాకు చేరాయని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లాకు చేరిన 415 ఆక్సిజన్‌ సిలిండర్లు

కలెక్టరేట్‌, జూలై 23:   ఏపీ  వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ( ఏపీఎంఐడీసీ) నుంచి 415 ఆక్సిజన్‌ సిలిండర్లు జిల్లాకు చేరాయని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ఇంకో 300 వరకూ సిలిండర్లు రానున్నాయని తెలిపారు. జిల్లాలో  అవసరాల మేరకు  వాటిని వినియోగిస్తామని చెప్పారు.  ప్రసుత్తం   మిమ్స్‌ వద్ద ఏర్పాటు చేసిన ఏపీఎంఎస్‌ఐడీసీ గొడౌన్‌లో వాటిని ఉంచుతామన్నారు.  

 

Updated Date - 2021-07-24T05:05:07+05:30 IST