Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అమెరికాలో అంబరాన్నంటిన టీడీపీ 40వ వార్షికోత్స‌వం!

twitter-iconwatsapp-iconfb-icon

జయరాం కోమటి ఆధ్వర్యంలో 40 నగరాల్లో ఘనంగా వేడుకలు!

తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలుగోడి సత్తాను గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించేలా చేసిన ఘనత ఎన్టీఆర్‌దే. ప్రాంతీయ పార్టీలు తలచుకుంటే జాతీయ పార్టీలను మట్టి కరిపించగలవని నిరూపించిన పార్టీ టీడీపీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్టీఆర్ త‌ర్వాత‌ ప‌గ్గాలు చేప‌ట్టిన‌, ప్ర‌స్తుత అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం పార్టీని జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లారు. జాతీయ రాజ‌కీయాలలోను పార్టీకి ఎన‌లేని గుర్తింపు తీసుకువ‌చ్చారు. అనేక రూపాల్లో జాతీయ స్థాయిలోనూ చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో దూకుడు ప్ర‌ద‌ర్శించి పార్టీ స‌త్తా చాటారు. ఉమ్మ‌డి రాష్ట్రంతో స‌హా న‌వ్యాంధ్ర‌లోనూ అనేక సంచ‌ల‌నాల‌కు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ వేదిక‌గా మారింది. 

అమెరికాలో అంబరాన్నంటిన టీడీపీ 40వ వార్షికోత్స‌వం!

అనేక మంది నాయ‌కుల‌ను, ఉద్ధండుల‌ను రాజ‌కీయాల‌కు అందించిన ఘనమైన చరిత్ర ఉన్న టీడీపీ, రాష్ట్ర ప‌రిపాల‌న‌లో త‌నకంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఈ క్రమంలోనే 1983లో అన్నగారు స్థాపించిన ఈ పార్టీ తాజాగా 40 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ టీడీపీ శ్రేణులు టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జయరాం కోమటి నాయకత్వంలో 40 నగరాలలో ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని ఎన్నారైలకు ఓ జ్ఞాపకంలా నిలిచిపోయేలా ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. టీడీపీ, నందమూరి అభిమానులు కుటుంబ సమేతంగా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

అమెరికాలో అంబరాన్నంటిన టీడీపీ 40వ వార్షికోత్స‌వం!

తెలుగుదేశం నాయకులు తణుకు మాజీ శాసనసభ్యుడు రాధాకృష్ణ ఆరిమిల్లి(షార్లెట్‌లో), మాజీ శాసన మండలి సభ్యుడు రవిచంద్ర బీద(చికాగోలో), జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కొమ్మారెడ్డి (డల్లస్‌లో), పశ్చిమ గోదావరి మాజీ జిల్లా పరిషత్  చైర్మన్ బాపిరాజు ముళ్ళపూడి(డల్లస్‌లో), టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శులు బుచ్చి రాంప్రసాద్ కలపటపు, మోహన కృష్ణ మన్నవ(న్యూ జెర్సీలో) ప్రత్యక్షంగా ఈ వేడుకల్లో పాల్గొని ఎన్నారై టీడీపీ అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

అమెరికాలో అంబరాన్నంటిన టీడీపీ 40వ వార్షికోత్స‌వం!

ఇక తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు, టెక్కిలి శాసనసభ్యులు అచ్చెన్నాయుడు కింజరపు, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు, టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు బుచ్చయ్య చౌదరి గోరంట్ల, పాలకొల్లు శాసనసభ్యులు రామానాయుడు నిమ్మల, విజయవాడ తూర్పు శాసనసభ్యులు రామ్మోహన్ గద్దె,  అద్దంకి శాసనసభ్యులు రవి గొట్టిపాటి, పర్చూరు శాసనసభ్యులు సాంబశివరావు ఏలూరి, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు కింజరపు, దెందులూరు మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చింతమనేని, నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు అయ్యన్నపాత్రుడు చింతకాయల, మైలవరం మాజీ శాసనసభ్యులు ఉమామహేశ్వర్ దేవినేని, పొన్నూరు మాజీ శాసనసభ్యులు నరేంద్ర ధూళిపాళ్ల, విజయవాడ మాజీ మేయర్ అనూరాధ పంచుమర్తి తదితరులు జూమ్ మీటింగ్ ద్వారా ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించి వారిని ఉత్తేజపరిచారు. 

అమెరికాలో అంబరాన్నంటిన టీడీపీ 40వ వార్షికోత్స‌వం!


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.