4072 వీధుల్లో Covid

ABN , First Publish Date - 2022-01-12T13:35:30+05:30 IST

రాజధాని నగరం చెన్నైలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు అధికమవుతున్నాయి. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో వైరస్‌ నిరోధక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నప్పటికీ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు.

4072 వీధుల్లో Covid

- విమానాలపై కొవిడ్‌ ప్రభావం 

- 20 సర్వీసుల రద్దు


చెన్నై: రాజధాని నగరం చెన్నైలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు అధికమవుతున్నాయి. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో వైరస్‌ నిరోధక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నప్పటికీ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. నగరంలో మొత్తం 4072 వీధుల్లో కరోనా బాధితులున్నట్లు తేలింది. ఐదుకు పైగా కరోనా కేసులు నమోదైన 293 వీధులను కరోనా కట్టడి ప్రాంతాలుగా ప్రకటించారు. డిసెంబర్‌లో నగరంలో వందకంటే తక్కువ వీధుల్లో మాత్రమే స్వల్పంగా కరోనా కేసులు నమోదయ్యాయి. రెండు వారాల్లో ఆ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. తేనాంపేటజోన్‌లో అధికపక్షంగా 444 వీధుల్లో కరోనా బాధితులు ఐసోలేషన్‌లో ఉన్నారు. నగరంలో ఇప్పటివరకూ 5.54 లక్షల మంది కరోనా సోకినట్లు కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 20267 మంది కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ల బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో యాభై శాతం మంది ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు.


తగ్గిన విమాన ప్రయాణికులు...

చెన్నై విమానాశ్రయంలో కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి కారణంగా ప్రయాణికులు సంఖ్య తగ్గింది. ప్రతిరోజూ ఈ విమా నాశ్రయంలో 270 దాకా విమానాలు వచ్చి వెళ్తుంటాయి. సుమారు 30 వేల మంది ప్రయాణించేవారు. గత కొద్ది రోజులుగా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రయాణి కుల సంఖ్య బాగా తగింది. జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ, ముంబాయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర నగరాలకు వెళ్లే ప్రయాణికులు ఆఖరి క్షణంలో తమ టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. ప్రయాణికుల సంఖ్య తగ్గటంతో 20 విమానాలను చివరి క్షణంలో రద్దు చేశారు. ఢిల్లీ- చెన్నై మార్గంలో వచ్చి వెళ్లే ఆరు విమానాలు, కోల్‌కతా- చెన్నై మార్గంలో నాలుగు, హైదరాబాద్‌- చెన్నై మార్గంలో నాలుగు, ముంబాయి - చెన్నై మార్గంలో రెండు, పూణే - చెన్నై మార్గంలో వచ్చి వెళ్లే రెండు విమానాలు రద్దయ్యాయి. ఇదే విధంగా మరికొన్ని విమాన సర్వీసులు కూడా ప్రయణికులు లేక రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా, ఇండిగో సంస్థలు రద్దయిన విమానాల్లో టికెట్లు బుక్‌ చేసుకున్నవారు మార్చి నెల 31లోపు తాము వెళ్ళాల్సిన నగరాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని ప్రకటించాయి.

Updated Date - 2022-01-12T13:35:30+05:30 IST