జిల్లాకు 40 వేల డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-05-06T05:19:15+05:30 IST

జిల్లాకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం 40 వేల డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను పంపించింది. ఐదు రోజుల కిందటే నిల్వలు నిండుకోవడంతో..ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్‌ వస్తుందా..? అని అంతా ఎదురుచూస్తున్నారు.

జిల్లాకు 40 వేల డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌

నౌకాదళానికి నాలుగు వేలు,

స్టీల్‌ప్లాంట్‌కు నాలుగు వేల డోసులు కేటాయింపు


విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం 40 వేల డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను పంపించింది. ఐదు రోజుల కిందటే నిల్వలు నిండుకోవడంతో..ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్‌ వస్తుందా..? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 40 వేల డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను పంపించింది. ఇందులో నాలుగు వేల డోసులు నౌకాదళం అధికారులకు, మరో నాలుగు వేల డోసులు స్టీల్‌ప్లాంట్‌కు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కేటాయించారు. మిగిలిన 32 వేల డోసుల వ్యాక్సిన్‌ను జిల్లాలోని వివిధ కేంద్రాలకు పంపించినట్టు వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ తిరుపతిరావు తెలిపారు. ప్రస్తుతానికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ మాత్రమే అందుబాటులోకి వచ్చిందని, మరికొద్దిరోజుల్లో కొవాగ్జిన్‌ వస్తుందని భావిస్తున్నామన్నారు. కొవాగ్జిన్‌ రెండో డోసు తీసుకోవలసినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండు, మూడు రోజులు ఆలస్యమైనంత మాత్రాన ఇబ్బందేమీ ఉండదన్నారు.

Updated Date - 2021-05-06T05:19:15+05:30 IST