Ukraineలో వింత పరిణామం.. ఓ వైపు యుద్ధం జరుగుతుంటే.. మరోవైపు ఆ దేశ పౌరులు ఇలా..

ABN , First Publish Date - 2022-03-11T17:30:49+05:30 IST

ఉక్రెయిన్‌లో వింత పరిణామం చోటు చేసుకుంది. ఓ రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంటే మరో వైపు ఆ దేశ పౌరులు పెళ్లి బంధాలతో ఒక్కటవుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు వే

Ukraineలో వింత పరిణామం.. ఓ వైపు యుద్ధం జరుగుతుంటే.. మరోవైపు ఆ దేశ పౌరులు ఇలా..

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌లో వింత పరిణామం చోటు చేసుకుంది. ఓ రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంటే మరో వైపు ఆ దేశ పౌరులు పెళ్లి బంధాలతో ఒక్కటవుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు వేలాది మంది వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులే వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 

 


సుమారు 13 రోజుల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించింది. దీంతో ఉక్రెయిన్ సైనికులు కూడా ధీటుగా రష్యాతో పోరాడుతున్నారు. తమ దేశ సైనికులకు మద్దతుగా ఉక్రెయిన్ పౌరులు కూడా రణరంగంలోకి దూకుతున్నారు. ఇదే సమయంలో ఆ దేశ పౌరులు పెద్ద ఎత్తున పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. యుద్ధం మొదలైన నాటి నుంచి గత 13 రోజుల్లో సుమారు 4 వేల వివాహాలు ఉక్రెయిన్‌లో రిజిస్టర్ అయ్యాయని ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో 4,311 మంది పిల్లలకు ఉక్రెయిన్ మహిళలు జన్మనిచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. 




Updated Date - 2022-03-11T17:30:49+05:30 IST