కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రె పిల్లలు

ABN , First Publish Date - 2022-01-22T03:39:49+05:30 IST

మండలంలోని అప్పసముద్రం పంచాయతీ మసీదుపల్లి గ్రామంలో కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లలు మృతి చెందగా మరో 10 పిల్లలు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది.

కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రె పిల్లలు
కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రె పిల్లలు

కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లల మృతి

ఉదయగిరి రూరల్‌, జనవరి 21: మండలంలోని అప్పసముద్రం పంచాయతీ మసీదుపల్లి గ్రామంలో కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లలు మృతి చెందగా మరో 10 పిల్లలు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. బాఽధితుడు పఠాన్‌ ఖాదర్‌ఖాన్‌ కథనం మేరకు.. 3, 4 నెలల వయసు గల పిల్లలను గురువారం ఇంటి పక్కనే ఉన్న దొడ్డిలో తోలి గొర్రెలను గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి మేతకు తోలుకెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చేసరికి దొడ్లో ఉన్న 50 పిల్లలపై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి. ఈ దాడిలో 40 పిల్లలు మృతి చెందగా 10 పిల్లలు తీవ్రంగా గాయపడ్డాయి. జీవాలే జీవనాధారంగా జీవించే తమకు కుక్కల దాడిలో పిల్లలు మృత్యువాతపడడంతో తీవ్రంగా నష్టపోయామని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పశు వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని యజమాని వేడుకొంటున్నాడు. 


Updated Date - 2022-01-22T03:39:49+05:30 IST