ప్రపంచంలో 4 కోట్ల మందికి కరోనా... కొన్ని దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్?

ABN , First Publish Date - 2020-10-18T14:26:58+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది కరోనా వైరస్ బారినపడ్డారు. అమెరికాలో 80 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 4 కోట్లకు చేరువలో ఉంది. రోజురోజుకు నమోదవుతున్న కరోనా కేసులు రికార్టులు...

ప్రపంచంలో 4 కోట్ల మందికి కరోనా... కొన్ని దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్?

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది కరోనా వైరస్ బారినపడ్డారు. అమెరికాలో 80 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 4 కోట్లకు చేరువలో ఉంది. రోజురోజుకు నమోదవుతున్న కరోనా కేసులు రికార్టులు సృష్టిస్తున్నాయి. యూరప్, ఇటలీ, జర్మనీ దేశాలు మొదలుకొని పోర్చుగల్ వరకూ కరోనా కేసులు రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. 


ఈ నేపధ్యంలో కొన్నిదేశాలు మరోమారు లాక్‌డౌన్ విధించే దిశగా ఆలోచిస్తున్నాయి. లండన్‌లో ఉంటున్నవారు ఇతరులను తమ ఇళ్లకు రానివ్వడం లేదు. అలాగే ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌తో పాటు మరో 8 నగరాలకు చెందిన ప్రజలు నాలుగు వారాల పాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ తమ ఇళ్లలోనే ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. స్పెయిన్‌లో కొత్తగా 6,593 కేసులు నమోదు కాగా, ఇటలీలో కొత్తగా రికార్డు స్థాయిలో 10,010 కేసులు నమోదయ్యాయి. బెల్జియంలో నాలుగువారాల పాటు రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించారు. 


Updated Date - 2020-10-18T14:26:58+05:30 IST