40మంది హోం క్వారంటైన్‌

ABN , First Publish Date - 2020-05-24T09:43:01+05:30 IST

మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలో అధికారులు 40 మందిని హోం క్వారంటైన్‌ చేశారు. షాద్‌నగర్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిన యువకుడు గత నెల 18వ

40మంది హోం క్వారంటైన్‌

ఫంక్షన్‌లో పాల్గొన్న  షాద్‌నగర్‌ కరోనా పాజిటివ్‌ యువకుడు

బండవెల్కిచర్ల గ్రామాన్ని సందర్శించిన డీఎస్పీ శ్రీనివాస్‌


కులకచర్ల: మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలో అధికారులు 40 మందిని హోం క్వారంటైన్‌ చేశారు. షాద్‌నగర్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిన యువకుడు గత నెల 18వ తేదీన బండవెల్కిచర్లలో జరిగిన ఫంక్షన్‌లో పాల్గొన్నాడు. శనివారం గ్రామాన్ని డీఎస్పీ శ్రీనివాస్‌ సందర్శించగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు.   పాజిటివ్‌ వచ్చిన యువకుడి బంధువులతో పాటు ఫంక్షన్‌కు వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వారు ఎవరెవరిని కలిశారనే వివరాలు సేకరించారు. హోం క్వారంటైన్‌ చేసిన కాలనీని కట్టడి చేశారు. డీఎస్పీ వెంట కొడంగల్‌ సీఐ నాగేశ్వర్‌రావు, తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, వైద్యాధికారి మురళీకృష్ణ, ఎస్‌ఐ వెంకటేశ్‌, సీహెచ్‌వో చంద్రప్రకాశ్‌,  సర్పంచ్‌ శిరీషారెడ్డి,  సిబ్బంది ఉన్నారు.


267 ఇళ్ల క్వారంటైన్‌

కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా అధికారులు మండలంలోని ఆయా గ్రామాల్లో పర్యటించి 267 ఇళ్లకు క్వారంటైన్‌ విధించారు. శనివారం మండలంలోని వివిధ గ్రామాలు, తండాల్లో అధికారులు పర్యటించారు. ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ అరుణదేశ్యుచౌహాన్‌, వైస్‌ ఎంపీపీ శేరినారాయణరెడ్డి, తహసీల్దార్‌ షాహేదాబేగం, వైద్యాధికారి రవీంద్రయాదవ్‌, పోలీసులు కరోనా అనుమానితులను గుర్తించి హోం క్వారంటైన్‌ ముద్రలు వేశారు. 

Updated Date - 2020-05-24T09:43:01+05:30 IST