4 బంతుల్లో 4 వికెట్లు

ABN , First Publish Date - 2020-08-15T08:56:44+05:30 IST

జర్మనీకి చెందిన భారత సంతతి మీడియం పేసర్‌ అనురాధ దొడ్డబల్లాపూర్‌ అంతర్జాతీయ టీ20లలో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రియా జట్టుతో

4 బంతుల్లో 4  వికెట్లు

ఆస్ట్రియా (వియన్నా): జర్మనీకి చెందిన భారత సంతతి మీడియం పేసర్‌ అనురాధ దొడ్డబల్లాపూర్‌ అంతర్జాతీయ టీ20లలో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రియా జట్టుతో శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. 199 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రియాను 33 ఏళ్ల అనురాధ బెంబేలెత్తించింది. 15వ ఓవర్లో ఆమె వరుసగా నలుగురు బ్యాట్స్‌వుమెన్‌ను అవుట్‌ చేసింది. కేవలం ఒక పరుగు మాత్రమే సమర్పించుకున్న జర్మనీ కెప్టెన్‌ అనురాధ ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా ఐదు వికెట్లు సాధించడం విశేషం. ఛేదనలో ఆస్ట్రియా 20 ఓవర్లలో 61/9 స్కోరే చేయగలిగింది. దాంతో జర్మనీ 137 పరుగులతో నెగ్గింది. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో జర్మనీ  4-0తో ఆధిక్యంలో నిలిచింది.

Updated Date - 2020-08-15T08:56:44+05:30 IST