ఈ నలుగురికీ కలిపి రూ.10 లక్షలను ఇచ్చిన Dubai రాజు.. ఇంతకీ వాళ్లేం చేశారంటే..

ABN , First Publish Date - 2021-08-28T17:05:35+05:30 IST

ఓ పిల్లిని కాపాడితే లక్షాధికారులు కావచ్చంటే నమ్ముతారా..? ఏకంగా మహారాజు నుంచే ప్రశంసలు లభిస్తాయంటే ఒప్పుకుంటారా..? కానీ దుబాయ్‌కి ..

ఈ నలుగురికీ కలిపి రూ.10 లక్షలను ఇచ్చిన Dubai రాజు.. ఇంతకీ వాళ్లేం చేశారంటే..

దుబాయ్‌: ఓ పిల్లిని కాపాడితే లక్షాధికారులు కావచ్చంటే నమ్ముతారా..? ఏకంగా మహారాజు నుంచే ప్రశంసలు లభిస్తాయంటే ఒప్పుకుంటారా..? కానీ దుబాయ్‌కి చెందిన ఆ నలుగురి విషయంలో అదే జరిగింది. గర్భంతో ఉన్న ఓ పిల్లి  రెండో అంతస్థులోని బాల్కనీ నుంచి పడిపోగా.. దానిని స్థానికులు నలుగురు కాపాడారు. పిల్లికి ఒక్క దెబ్బ కూడా తగలకుండా రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన దుబాయ్ రాజు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్.. కూడా వారు చేసిన పనిని ఎంతగానో మెచ్చుకున్నారు. వారికి భారీ నజరానా కూడా ప్రకటించారు. ఏకంగా 50వేల దుబయ్ దిర్హామ్‌లు(దాదాపు రూ.10 లక్షలకు పైగా) నగదు బహుమతిని ప్రకటించారు. 



అలాగే ఆ నలుగురు పిల్లిని కాపాడిన వీడియోను కూడా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఇలాంటి మంచి పనులు మన అందమైన నగరంలో జరగడం ఆనందంగా ఉంది. పేరు తెలియని హీరోలు వాళ్లెవరైతే ఏమి.. మా తరపున వారికి ధన్యవాదాలు చెప్పండి’ అని ఆ ట్వీట్‌లో షేక్ మహమ్మద్ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ వీడియోలో సెకండ్ ఫ్లోర్ నుంచి ఓ పిల్లి పడిపోతుండగా.. కింద రోడ్డుపై నలుగురు వ్యక్తులు దుప్పటిని వలలా పట్టుకుని నిలుచుకున్నారు. పిల్లి అక్కడి నుంచి దూకేయగా.. దానిని వెంటనే దుప్పటితో పట్టుకుని కింద విడిచిపెట్టారు.  



Updated Date - 2021-08-28T17:05:35+05:30 IST