Meghalaya: భారీ వరదలు, విరిగిన కొండచరియలు.. నలుగురు మృతి

ABN , First Publish Date - 2022-06-09T19:40:14+05:30 IST

మేఘాలయలోని పశ్చిమ గారో హిల్స్ ప్రాంతంలో గురువారం రెండు వేరు వేరు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు గాయపడగా వారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు..

Meghalaya: భారీ వరదలు, విరిగిన కొండచరియలు.. నలుగురు మృతి

షిల్లాంగ్: మేఘాలయలోని పశ్చిమ గారో హిల్స్ ప్రాంతంలో గురువారం రెండు వేరు వేరు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు గాయపడగా వారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సదరు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇక రాష్ట్రంలోని వరదల కారణంగా బుధవారం రాత్రి రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో భారీగా పడుతున్న వర్షాలకు వరదలు పోటెత్తాయి. కాగా, భారత వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రంలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్‌ని ప్రకటించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-06-09T19:40:14+05:30 IST