లారస్‌ ల్యాబ్స్‌ లాభంలో 4% వృద్ధి

ABN , First Publish Date - 2022-07-28T08:41:33+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి లారస్‌ ల్యాబ్స్‌ ఏకీకృత లాభం 4 శాతం పెరిగి రూ.251 కోట్లుగా నమోదైంది.

లారస్‌ ల్యాబ్స్‌ లాభంలో 4% వృద్ధి

 హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి లారస్‌ ల్యాబ్స్‌ ఏకీకృత లాభం 4 శాతం పెరిగి రూ.251 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.241 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికానికి ఆదాయం 20 శాతం పెరిగి రూ.1,279 కోట్ల నుంచి రూ.1,539 కోట్లకు చేరింది. ఈ కాలంలో కంపెనీ రూ.209 కోట్ల పెట్టుబడులు పెట్టింది. వ్యాపార కార్యకలాపాలను ఇతర విభాగాలకు విస్తరించే వ్యూహంలో భాగంగా నాన్‌-ఏఆర్‌వీ ఏపీఐలు, ఫార్ములేషన్లు, సీడీఎంఓ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించామని లారస్‌ ల్యాబ్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ చావా సత్యనారాయణ తెలిపారు. 

Updated Date - 2022-07-28T08:41:33+05:30 IST