రష్యా వాయుసేనలో మరోసారి హెలికాప్టర్ ప్రమాదం.. నలుగురు మృతి

ABN , First Publish Date - 2020-05-26T22:53:40+05:30 IST

రష్యన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ ఎమ్‌ఐ-8 హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయింది.

రష్యా వాయుసేనలో మరోసారి హెలికాప్టర్ ప్రమాదం.. నలుగురు మృతి

మాస్కో: రష్యన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ ఎమ్‌ఐ-8 హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు క్రూసభ్యులు, ఓ టెక్నీషియన్ మరణించినట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. చుకోట్కా ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ జరిగినట్లు సమాచారం. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఎమ్ఐ-8 హెలికాప్టర్‌లు ఇలా క్రాష్ ల్యాండ్ అవడం ఈ వారంలో ఇది రెండోసారి. మే 19న కూడా ఓ ఎమ్ఐ-8 హెలికాప్టర్ క్లిన్ ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ అయింది.

Updated Date - 2020-05-26T22:53:40+05:30 IST