Abn logo
Mar 29 2020 @ 16:57PM

4 కరోనా పాజిటివ్ కేసులతో అధికారుల అప్రమత్తం

గుంటూరు: 4 కరోనా పాజిటివ్ కేసులతో అధికారుల అప్రమత్తమయ్యారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇచ్చిన విందులో పాల్గొన్న వారిపై అధికారులు ఆరా తీస్తున్నారు. మాచర్ల, నరసరావుపేటలో 30 మంది గుర్తించారు. వీరిని ఐదు అంబులెన్స్‌లలో జీజీహెచ్‌కు తరలించారు. 


మరోవైపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోన అనుమానంతో వచ్చిన వారు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ప్రాథమిక దశలో లక్షణాలు గుర్తించిన వారిని వెంటనే సమీపంలోని క్వారంటైన్‌ సెంటర్‌కు పంపాలి. ఈ దశలో ప్రభుత్వం జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. 24 గంటలు విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. కానీ అది అమలు జరగటం లేదు. ప్రభుత్వ అంబులెన్స్‌ రావడం లేదు. ప్రైవేటు వారు చేతులెత్తేశారు... దీంతో అనుమానితులను గంటల కొద్ది వేచి ఉండేలా చేస్తున్నారు. ఇప్పటికైనా కరోన సెంటర్‌ వద్ద ప్రత్యేక అంబులెన్స్‌ను కోరుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement