Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 26 Jan 2022 14:03:19 IST

Dhnush : బాలీవుడ్ దర్శకుడితో మూడోసారి

twitter-iconwatsapp-iconfb-icon
Dhnush : బాలీవుడ్ దర్శకుడితో మూడోసారి

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. రెండు సార్లు నేషనల్ అవార్డ్ కైవసం చేసుకున్న బెస్ట్ పెర్ఫార్మర్. అందుకే బాలీవుడ్ ఎంట్రీ చాలా సులువుగా లభించింది. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ మలిచిన ‘రాంఝానా’ చిత్రంతో ధనుష్ బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇదే దర్శకుడితో ‘అత్రంగిరే’ అనే సినిమాలో కూడా ధనుష్ హీరోగా నటించి.. మరోసారి సక్సెస్ అందుకున్నాడు. రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి మంచి అప్లాజ్ లభించింది. ఈ రెండు సినిమాలతోనే ధనుష్ కి, ఆనంద్ రాయ్ కి మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ధనుష్ తో మరో సినిమా తీయడానికి ఆనంద్ ఎల్.రాయ్ రెడీ అవుతున్నాడు. 


తొలి రెండు చిత్రాలతోనూ ధనుష్ బాలీవుడ్ లో లవర్ బాయ్ గా మెప్పించాడు. అయితే ఈ సినిమాలో మాత్రం మాస్ అవతారంలో కనిపిస్తాడట. దీని కోసం ప్రత్యేక మేకోవర్‌‌‌తో కనిపిస్తాడట. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ప్రస్తుతం సార్ అనే డైరెక్ట్ తెలుగు మూవీలో నటిస్తున్న ధనుష్.. తమిళంలో పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వీటి తర్వాత బాలీవుడ్ మూవీకి కాల్షీట్స్ ఇస్తాడని తెలుస్తోంది. మరి ధనుష్, ఆనంద్ ఎల్.రాయ్ కాంబోలో హ్యాట్రిక్ హిట్ వస్తుందేమో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...