ఎన్నారై డెస్క్: ఉపాధి కోసం ఎడారి దేశానికి వెళ్లిన ముగ్గురు భారతీయులను అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే వాళ్ల జీవితాలు మారిపోయి లక్షాధికారులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. కాగా... ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
55ఏళ్ల సుబ్రహ్మణ్యం కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం యూఏఈ వెళ్లాడు. ప్రస్తుతం షార్జాలో ఉంటున్న అతడు.. మహజూజ్ వీక్లి లక్కీడ్రాలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయనకు అదృష్టం వరించింది. ఏకంగా లక్ష దిన్హార్లను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కూడా తాను మహజూజ్ డ్రాలో పాల్గొని, చిన్న మొత్తంలో డబ్బులు గెలుచుకున్నట్లు చెప్పాడు. అయితే ఇంత పెద్ద మొత్తంలో (సుమారు రూ.20.67లక్షలు) ఎపుడూ గెలుచుకోలేదని వెల్లడించాడు.
ఈ డబ్బును తన కూతురి భవిష్యత్తు కోసం ఉపయోగించనున్నట్లు తెలిపాడు. సౌదీ అరేబియాలో ఎలక్ట్రానిక్ స్టోర్ నడుపుతున్న 54ఏళ్ల ఇబ్రహీం కూడా మహజూజ్ డ్రాలో రూ.20.67లక్షలు గెలుచుకున్నాడు. ఇతడు కూడా ఈ డబ్బును తన కూతురు కోసమే వెచ్చించనున్నట్టు చెప్పాడు. ఇకపోతే.. 10వ తరగతి మధ్యలోనే చదువు మానేసి ఉపాధి కోసం సౌదీ వెళ్లిన 54ఏళ్ల సుభాష్‌చంద్ర కూడా లక్ష దిన్హార్లను గెలుచుకుని లక్కీ విన్నర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. ఎటువంటి అప్పులు చేయకుండా తన కూతురు పెళ్లి జరిపించడానికి ఈ డబ్బును ఖర్చు చేస్తానని సుభాష్‌చంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి