సంగారెడ్డి జిల్లాకు 390 కోట్ల నిధులు విడుదల: హరీష్‌రావు

ABN , First Publish Date - 2022-03-02T21:05:41+05:30 IST

ఇటీవల సీఎం కేసీఆర్ సంగారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాకు

సంగారెడ్డి జిల్లాకు 390 కోట్ల నిధులు విడుదల: హరీష్‌రావు

సంగారెడ్డి: ఇటీవల సీఎం కేసీఆర్ సంగారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాకు 390 కోట్ల నిధులను విడుదల చేశారని మంత్రి హరీష్‌రావు తెలిపారు. పట్టణంలో ఆయన మాట్లాడుతూ ఈ నిధులను ప్రజల అత్యంత అవసరమైన పనులకు ఉపయోగించే విధంగా ప్రతిపాదనలు రూపొందించే విధంగా ఎమ్మెల్యేలు చొరవ చూపాలని ఆయన కోరారు. మన ఊరు-మన బడి ఒక అధ్బుతమైన పథకమన్నారు. దీనిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలో ప్రారంభించాలని కేసీఆర్ సంకల్పించారని ఆయన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తే పేద పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో చదివే అవకాశం కలుగుతుందన్నారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.మన ఊరు మన బడికోసం  7,289 కోట్లు  మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈనెల ఎనిమిదిన వనపర్తిలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారన్నారు. ఈ సందర్భంగా మన ఊరు - మన బడికి తన నెల వేతనాన్ని మంత్రి విరాళంగా ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మన ఊరు -మన బడి కార్యక్రమం కింద 1097 పాఠశాలలు ఎంపిక అయ్యాయని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-03-02T21:05:41+05:30 IST