HYD : తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలని Women పాడు పని.. మాటలతో మభ్యపెట్టి..!

ABN , First Publish Date - 2021-11-20T12:09:47+05:30 IST

తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలని Women పాడు పని.. మాటలతో మభ్యపెట్టి..

HYD : తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలని Women పాడు పని.. మాటలతో మభ్యపెట్టి..!

  • కిలాడీ స్నాచర్‌
  • మాటలతో మభ్యపెట్టి చోరీలు... ఇద్దరి అరెస్ట్‌


హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఓ ట్రాన్స్‌ జెండర్‌తో పాటు సహకరిస్తున్న మరొకరిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకృష్ణ కథనం ప్రకారం.. బెంగళూర్‌కు చెందిన (ట్రాన్స్‌జెండర్‌) అంజుం (39), అదే ప్రాంతానికి చెందిన బసవరాజ్‌ (25) తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనుకున్నారు. 2021 నవంబర్‌ 12న బెంగళూర్‌ నుంచి సికింద్రాబాద్‌ వచ్చి ఓ లాడ్జిలో బస చేశారు. అదే రోజు సికింద్రాబాద్‌ మహంకాళి పోలీస్‌స్టేషన్‌ పరిధి షెనాయ్‌ ట్రేడ్‌ సెంటర్‌ (సీటీసీ) వద్ద రాత్రి సమయంలో ఓ కారు యజమానికి మాయమాటలు చెప్పి, కారు డోర్‌ తీయించారు.


అతడి కళ్లు గప్పి 40 గ్రాముల బంగారు గొలుసుతో పాటు కారులో ఉన్న ల్యాప్‌టాప్‌ను దొంగిలించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహంకాళి పోలీసులు కేసును నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అప్పగించారు. డీసీపీ రాధాకృష్ణ ఆదేశాల మేరకు సీఐ నాగేశ్వర్‌రావు, ఎస్‌ఐలు శ్రీకాంత్‌, అశోక్‌రెడ్డి, శివానంద బృందం సీసీ ఫుటేజీలు పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు సికింద్రాబాద్‌లో మాటు వేశారు. అనుమానాస్పదంగా తిరుగుతుండగా అంజుంను అదుపులోకి తీసుకుని విచారించారు. 


చోరీ చేసి నగల్ని అమ్మేందుకు తన అనుచరుడు బసవరాజుకు ఇచ్చినట్లు అంగీకరించారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో లిఫ్ట్‌ పేరుతో ఒకరి బైకు ఎక్కి బంగారు గొలుసు తెంపుకొని పారిపోయామని విచారణలో అంగీకరించారు. రెండు కేసుల్లో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 40 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-11-20T12:09:47+05:30 IST