Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్నారైల 382 పాస్‌పోర్టులు రద్దు

న్యూఢిల్లీ: భార్యలను వదిలేస్తామని బెదిరింపులకు పాల్పడిన ఎన్నారైల 382 పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు కేంద్రం గురువారం పార్లమెంట్‌లో తెలిపింది. 2015 నుంచి ఇప్పటివరకు ఇలా 382 పాస్‌పోర్టులను రద్దు చేయడం లేదా స్వాధీనం చేసుకోవడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఇటువంటి కేసులలో ఇప్పటివరకు 216 మంది మహిళలు ప్రభుత్వం నుండి న్యాయ, ఆర్థిక సహాయం కోరినట్లు వెల్లడించింది. ఇక కాంగ్రెస్ ఎంపీ పార్తాప్ సింగ్ బజ్వా అడిగిన ఓ ప్రశ్నకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాధానమిస్తూ.. విదేశాలలో కష్టా సమయాల్లో భారతీయ పౌరులకు సహాయం చేయడానికి అక్కడి అఖిల భారత మిషన్లు భారత సమాజ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.   

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement