మంచుగడ్డల కింద ఈత.. 38 ఏళ్ల యువకుడి ప్రపంచ రికార్డు...

ABN , First Publish Date - 2021-02-26T02:11:03+05:30 IST

చెక్ రిపబ్లిక్‌కు చెందిన 38 ఏళ్ల ఫ్రీడైవర్ డేవిడ్ వెన్సిల్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు...

మంచుగడ్డల కింద ఈత.. 38 ఏళ్ల యువకుడి ప్రపంచ రికార్డు...

ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): చెక్ రిపబ్లిక్‌కు చెందిన 38 ఏళ్ల ఫ్రీడైవర్ డేవిడ్ వెన్సిల్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. మంచుగడ్డల కింద 266 అడుగుల మేర ఈతకొట్టి గత రికార్డును చెరిపివేశాడు. కేవలం స్విమ్ సూట్ ధరించి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో దాదాపు ఒకటిన్నర నిమిషాల్లో డేవిడ్ ఈ ఘనత సాధించాడు. కాగా ఇంతకు ముందు ఈ రికార్డు డెన్మార్క్‌ ఈతగాడు స్టిగ్ అవల్ సావరిన్సెన్ పేరు మీద ఉంది. 2013లో అతడు 250 అడుగులు ఈదాడు. తాజాగా ఈ రికార్డును బ్రేక్ చేసిన డేవిడ్ వెన్సిల్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2021-02-26T02:11:03+05:30 IST