కాగ్నిజెంట్‌ లాభంలో 37.6శాతం వృద్ధి

ABN , First Publish Date - 2021-05-07T06:34:06+05:30 IST

మార్చితో ముగిసిన త్రైమాసికానికి గాను కాగ్నిజెంట్‌ నికర లాభం 37.6 శాతం వృద్ధి చెంది 50.5 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఆదాయం 4.2 శాతం పెరిగి 440 కోట్ల డాలర్లుగా...

కాగ్నిజెంట్‌ లాభంలో 37.6శాతం వృద్ధి

ముంబై: మార్చితో ముగిసిన త్రైమాసికానికి గాను కాగ్నిజెంట్‌ నికర లాభం 37.6 శాతం వృద్ధి చెంది 50.5 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఆదాయం 4.2 శాతం పెరిగి 440 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది ఆదాయం 7-9 శాతం వృద్ధి చెందవచ్చని కంపెనీ అంచనా వేసింది. కాగ్నిజెంట్‌ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.96 లక్షలు కాగా, భారత్‌లోని కంపెనీ కార్యాలయాల్లోనే దాదాపు 2 లక్షల మంది పనిచేస్తున్నారు. కాగా, ఈ ఏడాది కొత్తగా 28వేల మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. 2020లో 17వేల మందిని కొత్తగా చేర్చుకుంది.


Updated Date - 2021-05-07T06:34:06+05:30 IST