Abn logo
Apr 10 2020 @ 16:59PM

ప్రకాశం జిల్లాలో 38కి చేరిన కరోనా కేసులు

ప్రకాశం: జల్లాలో కరోనా పాటిజీవ్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఒంగోలులోని ఇస్లాంపేటలో మొత్తం 17 పాజిటీవ్ కేసులు నమోదు కావడంతో అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు. కరోనా కట్టడికి స్థానికులు సహకరించాలని ఒంగోలు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఇస్లాంపేట, గోపాల్ నగర్‌లో జనసాంధ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారితో ఇక్కడ కరోనా విస్తరించిందన్నారు. వ్యాధి ఇతరులకు ప్రబలకుండా ఉండేందుకు ఈ ప్రాంతాన్ని రోడ్ జోన్‌గా ప్రకటించినట్లు చెప్పారు. దీనికి కాలనీలో ఉండేవారంతా సహకరించారని నిరంజన్ రెడ్డి చెప్పారు. రెడ్ జోన్‌లో ఉండేవారికి నిత్యావసర వస్తువులు అందజేయడానికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఏర్పాట్లు చేశారన్నారు. ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారని కమిషనర్ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement